బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

  • లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (Local Bank Officer): 2,482 పోస్టులు
    (తెలంగాణలో 50, ఆంధ్రప్రదేశ్‌లో 80 ఖాళీలున్నాయి)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో కనీసం ఒక సంవత్సరం పోస్ట్‌-క్వాలిఫికేషన్‌ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-08-2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ గరిష్ఠంగా 15 ఏళ్లు వయోసడలింపు వర్తిస్తుంది.

బేసిక్‌ పే: రూ.48,480 నుంచి రూ.85,920+ ఇతర అలవెన్సులు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (GD)/ ఇంటర్వ్యూ.

ఆన్‌లైన్ పరీక్ష విధానం: ఇంగ్లిష్‌-30, బ్యాంకింగ్ నాలెడ్జ్-30, జనరల్ /ఎకానామిక్‌ అవేర్‌నెస్-30, రీజనింగ్ & క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్-30 నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో 120 ప్రశ్నలు, 120 మార్కులు, 120 నిమిషాల వ్యవధి ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్థులకు రూ175.

చివరి తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: 18-08-2026.

దరఖాస్తు & ఫీజు చెల్లింపు చివరి తేదీ: 07-09-2026.

Website: https://ibpsreg.ibps.in/bobjul26/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram