సీఏపీఎఫ్‌ఎస్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

సీఏపీఎఫ్‌ఎస్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ)అస్సాం రైఫిల్స్‌లో మెడికల్ ఆఫీసర్ క్యాడర్ పోస్టుల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 282

వివరాలు:

  1. మెడికల్ ఆఫీసర్ : 115

  2. సూపర్‌ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ : 05
    3.స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్): 162

విభాగాలు: మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, & ఆబ్స్‌టెట్రిక్స్, అనస్థీషియా, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ తదితర విభాగాలు...

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణులై ఉండాలి.మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు సూపర్‌ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ కు రూ.78,800 - రూ.2,09,200.స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ కు రూ.67,700 - రూ.2,08,700. మెడికల్ ఆఫీసర్ కు రూ.56,100 - రూ.1,77,500.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల పురుష అభ్యర్థులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, మహిళలు మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ (200 మార్కులు), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 2026 ఆగస్టు 10.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 సెప్టెంబరు 08.

Website: https://recruitment.itbpolice.nic.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram