తెలంగాణలో పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) 2026, జులై 29న నోటిఫికేషన్‌లు జారీ చేసింది. అయితే దరఖాస్తుల స్వీకరణ తేదీని ఇంకా ప్రకటించలేదు. శాఖల వారీ ఖాళీల వివరాలు ఇలా..
పోలీస్ శాఖలో ఖాళీలు:
సివిల్ ఎస్సై : 148
ఏఆర్ ఎస్సై : 14
టీజీఎస్పీ ఏఆర్‌ఎస్సై : 12
ఎస్‌ఏఆర్ సీపీఎల్ ఎస్సై : 3
ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై : 23
సివిల్ కానిస్టేబుల్ : 3,697
ఏఆర్ కానిస్టేబుల్ : 1,052
ఎస్‌ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్ : 24
కానిస్టేబుల్(డ్రైవర్) పీటీవో : 20
కానిస్టేబుల్(మెకానిక్) పీటీవో : 7
మొత్తం: 5000
==========
అగ్నిమాపకశాఖలో ఖాళీలు..
స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39
ఫైర్ ఫైటర్: 751
మొత్తం: 790
========
జైళ్ల శాఖలో..
డిప్యూటీ జైలర్(పురుషులు): 14
డిప్యూటీ జైలర్(మహిళలు): 1
వార్డర్(పురుషులు): 196
వార్డర్(మహిళలు): 12
మొత్తం: 223
=========
ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పీఎఫ్)లో..
ఎస్సై: 44
కానిస్టేబుల్: 1,380
మొత్తం: 1424
గమనిక: పోలీస్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అంశాల వారీగా ఈనాడు ఈప్రతిభ యాప్/ వెబ్‌సైట్‌లో ‘తెలంగాణ పోలీస్ పరీక్షల ప్రత్యేకం’ కోర్సులో అందుబాటులో ఉంది. 600కి పైగా ప్రీ రికార్డెడ్ వీడియో పాఠాలు, 800కిపైగా జనరల్ స్టడీస్ ఈబుక్స్, 6వేలకు పైగా ప్రాక్టీస్ ప్రశ్నలతోపాటు కరెంట్ అఫైర్స్ మంత్లీ ఈబుక్స్ - పాక్టీస్ టెస్ట్స్‌తో సహా మీ ప్రిపరేషన్‌కు తోడ్పాటు అందించే ముఖ్య సమాచారం అందులో ఉంది. మరిన్ని వివరాల కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
ఇతర ముఖ్య వివరాలు..
జీతం: 24,280 నుంచి రూ.72,850 పే స్కేల్ ఉంటుంది.
విద్యార్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జులై 29 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారిని కూడా అర్హులుగానే పరిగణిస్తారు. ఫైర్ ఫైటర్ పోస్టుకు అదనంగా చెల్లుబాటు అయ్యే ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
వయోపరిమితి:
సాధారణంగా 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం యూనిఫామ్‌డ్ సర్వీసులకు గరిష్ఠ వయోపరిమితిపై 5 సంవత్సరాల అదనపు సడలింపు కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయో సడలింపు నిబంధనలు ఉన్నాయి. ఎక్స్ సర్విస్‌మెన్, ఎన్‌సీసీ, తదితర వర్గాలకు కూడా నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ప్రిలిమినరీ రాత పరీక్ష, పీఎంటీ/పీఈటీ, ఫైనల్ రాత పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు, 3 గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 20 శాతం నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించడానికి ఓసీ/ఈడబ్ల్యూఎస్‌లకు 30 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్విస్‌మెన్/హోంగార్డులకు 20 శాతం కనీస మార్కులు అవసరం.
ఫిజికల్ టెస్టులు:
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) నిర్వహిస్తారు.
పురుష అభ్యర్థులు 1,600 మీటర్ల పరుగును 7 నిమిషాల 15 సెకన్లలో, మహిళలు 800 మీటర్ల పరుగును 5 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాలి. ఎక్స్ సర్విస్‌మెన్‌కు 1,600 మీటర్ల పరుగుకు 9 నిమిషాల 30 సెకన్ల వరకు సమయం ఉంటుంది.
పురుషులకు సాధారణంగా కనీస ఎత్తు 167.6 సెం.మీ, మహిళలకు 152.5 సెం.మీ ఉండాలి. నిర్దిష్ట ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులకు ఎత్తులో ప్రత్యేక సడలింపు ఉంది.
అలాగే పురుషులకు 4 మీటర్ల లాంగ్ జంప్, 6 మీటర్ల షాట్‌పుట్; మహిళలకు 2.5 మీటర్ల లాంగ్ జంప్, 4 మీటర్ల షాట్‌పుట్ అర్హత అవసనం.
ఫైనల్ రాత పరీక్ష:
పీఈటీలో అర్హత సాధించిన వారికి ఫైనల్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇది 3 గంటల వ్యవధిలో ఒక పేపర్‌గా ఉంటుంది. పోస్టును బట్టి పరీక్ష 100 లేదా 200 మార్కులకు ఉంటుంది.
కానిస్టేబుల్ (సివిల్), ఫైర్ ఫైటర్, వార్డర్ పోస్టులకు 200 మార్కులు; కానిస్టేబుల్ (ఏఆర్), ఎస్‌ఏఆర్ సీపీఎల్, ఎస్‌పీఎప్ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులు ఉంటాయి.
ఫైనల్ పరీక్షలో కనీస అర్హత మార్కులు ఓసీ/ఈడబ్ల్యూఎస్‌లకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్విస్‌మెన్ 30 శాతంగా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ముందుగా టీఎస్‌ఎల్‌ఆర్‌పీబీ అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం పోస్టులను ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించి పార్ట్-I దరఖాస్తును పూర్తి చేయాలి. ఫొటో, సంతకాన్ని కలిపి జేపీజీ ఫైల్‌గా అప్‌లోడ్ చేయాలి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత పార్ట్-II దరఖాస్తు, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి.
ఫొటో + సంతకం ఫైల్ పరిమాణం 30కేబీ నుంచి 100కేబీ మధ్య ఉండాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత వివరాల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉండదు.
నోటిఫికేషన్ వెలువడిన తేదీ: 29.07.2026.
దరఖాస్తు ప్రాంరంభ తేదీ: 19-08-2026
దరఖాస్తు చివరి తేదీ: 09-09-2026
ఇవీ సమకూర్చుకోవాల్సిన ధ్రువీకరణపత్రాలు...
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల దాఖలు చేసే ముందే తెలంగాణలో స్థానికులైన అభ్యర్థులు కొన్ని ధ్రువపత్రాలను సమకూర్చుకోవాలని మండలి సూచించింది.
ఎస్సీ అభ్యర్థులు... ఎస్సీ గ్రూప్-1, 2, 3 ఉపవర్గీకరణతో కూడిన తాజా సామాజిక ధ్రువపత్రం.
ఎస్టీ అభ్యర్థులు తమ కులం సర్టిఫికెట్.
ఈడబ్ల్యూఎస్(ఆర్థికంగా బలహీనవర్గాలు) అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వం నుంచి పొందిన ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపత్రం.
బీసీ అభ్యర్థులు ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్.
అభ్యర్థులంతా 1-7 తరగతుల వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు లేదంటే నివాస ధ్రువీకరణపత్రం(రెండింటిలో ఏవి వర్తిస్తే అవి).
దివ్యాంగ, స్పోర్ట్స్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద అర్హులైతే సంబంధిత ధ్రువపత్రాలు.
Link copied to clipboard!
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
సిఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐలో టెక్నీషియన్ ఉద్యోగాలు
ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
పీఎం బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు
ఎన్టీఏలో ఆపరేషన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎంఈసీఎల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీఎంసీ నల్గొండలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పోస్ట్ బేసిక్ బి.ఎస్.సి.నర్సింగ్ ప్రవేశాలు
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో 8వ తరగతి ప్రవేశాలు
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్-2027)
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్-2026)
ఐపీఈ, హైదరాబాద్‌లో స్పాట్ అడ్మిషన్లు
మనూలో పీజీ, పీహెచ్డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్
ఏపీ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
గేట్ 2027 నోటిఫికేషన్
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2027
క్యాట్ 2026 - ఎంబీఏ/పీజీపీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌లో పోస్టులు
కుమరం భీమ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసిఫాబాద్‌లో టీచింగ్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఎయిమ్స్ గోరఖ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీలో మెడికల్ ఉద్యోగాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఐసీఏఆర్ - ఎన్ఆర్సీబీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఆర్ఆర్సీ- సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్, అంబర్‌నాథ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ ఎన్ఎఫ్సీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎంటీపీఎఫ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
బీఈఎంఎల్లో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
భారత్‌లో మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ
అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్
హాకీ ప్రపంచకప్
మహిళల హాకీ ప్రపంచకప్
డైమండ్ లీగ్ జ్యూరిచ్
గ్రాండ్ చెస్ టూర్
ముచోవా జోడీకి మిక్స్డ్ టైటిల్
క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.7,386 కోట్ల కేటాయింపు
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
‘ఏటీఆర్’ అధ్యయనం
మైక్రోసాఫ్ట్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2026
బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి
ఐసీఐఎంఓడీ పరిశోధన నివేదిక
మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం
వ్రైజే విశ్వవిద్యాలయ అధ్యయనం
‘గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా అవుట్‌లుక్ 2026-30’
నీతి ఆయోగ్ నివేదిక
నీతి ఆయోగ్ నివేదిక
‘ఆర్య.ఏజీ’ నివేదిక
ఆర్టీసీ ఎండీగా కోన శశిధర్
తెలుగు భాషా పురస్కారాలు
‘సంజీవని’ ప్రాజెక్టు
లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు ప్రమాణం
పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా
పంచాయతీరాజ్ సంస్థల్లోనూ 34% రిజర్వేషన్
పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లు
బీసీలకు 33.33% రిజర్వేషన్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు
మానవ అవయవాల మార్పిడి చట్ట సవరణ బిల్లు