ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ 

20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్‌ నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. కృష్ణబిలాల మీద అనేక పరిశోధనలు చేశారు.


20వ శతాబ్దంలోని ప్రముఖ ఖగోళ పరిశోధకుల్లో సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ ఒకరు. ఆయన ఇండో-అమెరికన్‌ నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. కృష్ణబిలాల మీద అనేక పరిశోధనలు చేశారు. భౌతికశాస్త్రంలో ‘కృష్ణ బిలాల గణిత సిద్ధాంతాన్ని’ (Mathematical Theory of black holes) కనుక్కున్నారు. అందుకుగానూ 1983లో నోబెల్‌ బహుమతి పొందారు. అక్టోబరు 19న చంద్రశేఖర్‌ జయంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

  • చంద్రశేఖర్‌ 1910, అక్టోబరు 19న లాహోర్‌ (ప్రస్తుత పాకిస్థాన్‌)లో జన్మించారు. 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందిన సీవీ రామన్‌ ఈయనకి బాబాయ్‌ అవుతారు. 1930లో పరిశోధనల నిమిత్తం కోపెన్‌హగన్‌లోని (డెన్మార్క్‌) ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ థియరిటికల్‌ ఫిజిక్స్‌కి వెళ్లారు. అక్కడే ఆయన నీల్స్‌ బోర్‌ను కలిశారు. నక్షత్రాల జననం, మరణాలపై అధ్యయనం చేశారు. 
  • నక్షత్రాలపై పరిశోధనలు చేసి 1930లో ‘చంద్రశేఖర్‌ లిమిట్‌’ను రూపొందించారు. స్థిరమైన తెల్ల మరుగుజ్జు నక్షత్రం గరిష్ఠ ద్రవ్యరాశిని దీంతో కొలుస్తారు. ఎలక్ట్రాన్లు, పరమాణు కేంద్రకాల వల్ల కలిగే పీడనం ద్వారా గురుత్వాకర్షణ శక్తిని తట్టుకోగల ఒక నక్షత్రానికి గరిష్ఠ ద్రవ్యరాశి ఉంటుందని ఆయన నిరూపించారు. ఈ పరిమితి విలువ సూర్యుడి ద్రవ్యరాశికి సుమారు 1.4 రెట్లు ఉంటుందని గణించారు.  
  • 1941-43 కాలంలో నక్షత్రాల గతిశాస్త్రం, బ్రౌనియన్‌ చలన సిద్ధాంతంపై దృష్టి సారించారు. నక్షత్ర సమూహాల్లో కదులుతున్న స్టార్స్‌ ఎలా వేగాన్ని కోల్పోతాయో వివరించడానికి ఆయన ‘గతి ఘర్షణ సిద్ధాంతాన్ని (stheory of dynamical friction)' అభివృద్ధి చేశారు. 1950లో నక్షత్రాలు, అక్కడి వాతావరణం నుంచి కాంతి ఎలా ప్రయాణిస్తుందనే దానిపై వివిధ సిద్ధాంతాలు అభివృద్ధి చేశారు.
  • 1940లలో సుంగ్‌-డావో లీ, చెన్‌-నింగ్‌ యాంగ్‌లకు ఫిజిక్స్‌ బోధించేందుకు వారాంతాలు తప్పనిసరిగా షికాగో యూనివర్సిటీకి వెళ్లేవారు. 1957లో ఆ ఇద్దరికీ భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. నక్షత్రాల నిర్మాణం, పరిణామాణానికి సంబంధించిన ముఖ్యమైన భౌతిక ప్రక్రియలపై తాను చేసిన సైద్ధాంతిక అధ్యయనాలకు గానూ 1983లో చంద్రశేఖర్‌కి నోబెల్‌ బహుమతి దక్కింది. 
  • నక్షత్రాలు, వాటి నిర్మాణంపై చంద్రశేఖర్‌ పరిశోధనలు, ఆవిష్కరణలు ఖగోళ ప్రపంచంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. నాసా నెలకొల్పిన ‘ఆస్ట్రోఫిజికల్‌ అబ్జర్వేటరీ’లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయనకు దక్కాల్సిన గౌరవం మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. ఆయన 1995, ఆగస్టు 21న చికాగోలో మరణించారు.
చంద్రశేఖర్‌ ముఖ్యమైన పరిశోధనలు, ప్రముఖ రచనలు, అవార్డులు - గౌరవాలు లాంటి ముఖ్య సమాచారంతో పాటు 2024లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, 2026లో ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌-2, ఎంటీఎస్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. కింది ఏ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త వేగంగా తిరిగే నక్షత్రాలు ధృవణ కాంతిని (polarised light) వెలువరిస్తాయని అంచనా వేశారు?
(జీసెట్, 2018)

1) ఎస్‌.చంద్రశేఖర్‌        2) సి.వి.రామన్‌

3) ఎస్‌.రామానుజన్‌       4) వెంకట రామన్‌ రామకృష్ణన్‌

సమాధానం: 1

2. స్థిరమైన తెల్ల మరుగుజ్జు నక్షత్రానికి సిద్ధాంతపరంగా సాధ్యమయ్యే గరిష్ఠ ద్రవ్యరాశిని ఏమంటారు?
(ఎస్‌ఎస్‌సీ జేఈ సీఈ, 2020)

1) రోచె లిమిట్‌                 2) చంద్రశేఖర్‌ లిమిట్‌

3) రుడాల్ఫ్‌ లిమిట్‌               4) బోస్‌ లిమిట్‌

సమాధానం: 2

3. చంద్రశేఖర్‌ లిమిట్‌ ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశికి ఎన్ని రెట్లు ఉంటుంది?
(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2025)

1) 1.4 రెట్లు         2) 2.8 రెట్లు

3) 1.2 రెట్లు         4) 1.8 రెట్లు

సమాధానం: 1

4. ఎస్‌.చంద్రశేఖర్‌కు కింది ఏ రంగంలో నోబెల్‌ బహుమతి లభించింది?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022)

1) కెమిస్ట్రీ            2) ఫిజిక్స్‌

3) మెడిసిన్‌         4) ఎకనామిక్‌ సైన్సెస్‌

సమాధానం: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram