ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ప్రశాంత చంద్ర మహలనోబిస్‌

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ సాంఖ్యక శాస్త్రవేత్త. ఈయన ‘మహలనోబిస్‌ డిస్టెన్స్‌’ అనే భావనను ప్రవేశపెట్టారు


ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ సాంఖ్యక శాస్త్రవేత్త. ఈయన ‘మహలనోబిస్‌ డిస్టెన్స్‌’ అనే భావనను ప్రవేశపెట్టారు. గణాంకాల సేకరణలో ఇది విప్లవాత్మక మార్పులు తెచ్చింది. మన దేశంలో ప్రణాళికల రూపకల్పనలోనూ ఈయన మార్గనిర్దేశం చేశారు. మహలనోబిస్‌ రూపొందించిన జాతీయ శాంపిల్‌ సర్వేలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ఈయన్ను ‘భారత సాంఖ్యకశాస్త్ర పితామహుడిగా’, ‘భారత ప్రణాళిక రూపశిల్పిగా’ పేర్కొంటారు. హీరాకుడ్, దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టులను ఈయన సాంఖ్యక పద్ధతుల ఆధారంగానే నిర్మించారు. గణాంకాలు, ఆర్థిక ప్రణాళికా రంగంలో మహలనోబిస్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఏటా ఆయన జన్మదినాన్ని మన దేశంలో ‘జాతీయ గణాంక దినోత్సవం’గా నిర్వహిస్తారు. ఇంతటి మహోన్నత శాస్త్రవేత్త జీవితంలోని ముఖ్య విషయాలను పోటీపరీక్షల కోణంలో తెలుసుకుందాం..!

  • మహలనోబిస్‌ 1893, జూన్‌ 29న కోల్‌కతాలో జన్మించారు. 1933లో ‘సంఖ్య’ పేరుతో పత్రికను స్థాపించారు. 1949లో భారత ప్రభుత్వానికి ప్రధాన గణాంక సలహాదారుగా నియమితులయ్యారు. 1955-67 వరకు భారత ప్రణాళికా సంఘంలో కీలక సభ్యుడిగా పనిచేశారు. రెండో పంచవర్ష ప్రణాళికను (1956-61) రూపొందించారు. దీన్నే మహలనోబిస్‌ నమూనా అంటారు.
  • 1931, డిసెంబరు 17న కోల్‌కతాలో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)ను ఏర్పాటు చేశారు. ఇది గణాంక శాస్త్రంలో పరిశోధన, శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కేంద్రంగా ఎదిగింది. 1950లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌)ను ఏర్పాటు చేశారు. 1951లో సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఓ)ను స్థాపించడంలో మహలనోబిస్‌ కీలకంగా వ్యవహరించారు.   
  • భారతదేశంలో గణాంకాలను సైన్స్‌ విభాగంలో ఒక సబ్జెక్ట్‌గా తీసుకురావడానికి మహలనోబిస్‌ ఎంతగానో కృషి చేశారు. 1968లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేసింది. గణాంకాలు, ఆర్థిక ప్రణాళికా రంగంలో మహలనోబిస్‌ చేసిన కృషికి గుర్తిపుగా ఏటా జూన్‌ 29న ‘జాతీయ గణాంక దినోత్సవం’గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2007లో తీర్మానించింది.
  • జాతీయ నమూనా సర్వే, కేంద్ర గణాంక సంస్థల ఏర్పాటు; శాస్త్రీయ ఆధారిత విధాన రూపకల్పన ద్వారా మహలనోబిస్‌ దేశ గణాంక వ్యవస్థపై గొప్ప ప్రభావం చూపారు. ఆయన పరిశోధనలు గణాంకాలకు మాత్రమే పరిమితం కాలేదు. భారతదేశ మొదటి ప్రణాళికా సంఘంలో సభ్యుడిగా ఉండి, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రెండో పంచవర్ష ప్రణాళికను రూపొందించడంలో సాయం చేశారు.
  • భారత ప్రణాళిక వ్యవస్థకు జవహర్‌లాల్‌ నెహ్రూ పితామహుడు అయితే, ఆ ప్రణాళిక పథానికి మార్గనిర్దేశకుడిగా మహలనోబిస్‌ ప్రసిద్ధి చెందారు. పారిశ్రామిక పెట్టుబడుల ద్వారానే దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఈయన భావించారు. భారత గణాంకశాస్త్రానికి దిశానిర్దేశం చేసిన పీసీ మహలనోబిస్‌ 1972, జూన్‌ 28న కోల్‌కతాలో మరణించారు. 

మహలనోబిస్‌ ముఖ్యమైన రచనలు, అందుకున్న గౌరవాలు - పురస్కారాలతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ ప్రిలిమినరీ, టీజీపీఎస్సీ ఏఈఈ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 80కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. పి.సి.మహలనోబిస్‌ను ఏమని పిలుస్తారు?

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2025)

1) భారతీయ గణాంక పితామహుడు

2) నూతన ఆర్థిక విధాన పితామహుడు

3) హరితవిప్లవ పితామహుడు

4) ఆర్‌బీఐ వ్యవస్థాపకుడు

సమాధానం: 1

2. 1931 డిసెంబరు 17న ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఎవరు స్థాపించారు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2019)

1) పి.సి.మహలనోబిస్‌        2) ఎం.హెచ్‌.హాన్సెన్‌

3) ఆర్‌.ఎ.ఫిషర్‌            4) ఎఫ్‌.యేట్స్‌

సమాధానం: 1

3. ప్రశాంత చంద్ర మహలనోబిస్‌ కింది ఏ సంస్థను స్థాపించారు?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2026)

1) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

2) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

3) ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌

4) నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆఫీస్‌

సమాధానం: 3

4. మహలనోబిస్‌ నమూనాను కింది ఏ పంచవర్ష ప్రణాళికలో ఉపయోగించారు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2025)

1) మొదటి   2) రెండో        3) మూడో    4) నాలుగో

సమాధానం: 2

5. Which of the following facts is NOT associated with PC Mahalanobis who contributed to the formulation of India’s Five Year Plans?
(SSC CGL Tier-I, 2022)
1) He established the Indian Statistical Institute.
2) He started the journal Sankhya.
3) He is known as the architect of Indian planning.
4) Mahalanobis was born in 1983 in Calcutta.
Ans: 4
6. PC Mahalanobis is remembered as a major contributor of India’s developmental path because he __________.
(i) set up Indian Institutes of Management located in different parts of India
(ii) formulated the Second Five-Year Plan
(iii) was the first Minister of Statistics and Programme Implementation
(SSC CHSL Exam Tier-I, 2024)
1) Only (i) and (iii) are true    2) Only (ii) is true
3) Only (i) and (ii) are true    4) Only (i) is true
Ans: 2
7. Which economist's ideas had a strong influence on the agricultural and industrial focus of the Second Five Year Plan?
(RPF Constable, 2025)
1) PC Mahalanobis    2) Manmohan Singh
3) Amartya Sen        4) Jagdish Bhagwati
Ans: 1
8. Which plan was based on the ideas of Mahalanobis, the architect of Indian planning?
(AP High Court Stenographer Grade II, Jr Assistant, Typist, Field Assistant, 2025)
1) First Plan            2) Third Plan        3) Fifth Plan            4) Second Plan
Ans: 4


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram