ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

లూయిస్‌ పాశ్చర్‌

లూయిస్‌ పాశ్చర్‌ ఫ్రెంచ్‌కి చెందిన రసాయన, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. సూక్ష్మజీవులపై ఈయన నిర్వహించిన అనేక పరిశోధనలు వైద్యశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి


లూయిస్‌ పాశ్చర్‌ ఫ్రెంచ్‌కి చెందిన రసాయన, సూక్ష్మజీవ శాస్త్రవేత్త. సూక్ష్మజీవులపై ఈయన నిర్వహించిన అనేక పరిశోధనలు వైద్యశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. మానవులకు, జంతువులకు సంక్రమించే అనేక వ్యాధులకు మైక్రోఆర్గానిజమ్స్‌ కారణమని మొదటిసారి గుర్తించింది ఈయనే. వాటి నివారణకు అనేక ప్రయోగాలు చేశారు. ఇదే ఆయన్ను టీకాల ఆవిష్కరణకు ఆద్యుడ్ని చేసింది. రేబిస్‌ - ఆంత్రాక్స్‌ టీకాలు, సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ కనుక్కోవడం, పాశ్చరైజేషన్‌ ప్రక్రియ మొదలైనవి ఈయన పరిశోధనల ఫలితాలే. సూక్ష్మజీవశాస్త్ర పితామహుడిగా పేరొందిన ఈయన సెప్టెంబరు 28న మరణించారు. దీనికి గుర్తుగా ఇదే తేదీన ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్‌ రేబిస్‌ డే’ను నిర్వహిస్తారు. పోటీపరీక్షల కోణంలో లూయిస్‌ పాశ్చర్‌కి సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం..!

  • లూయిస్‌ పాశ్చర్‌ 1822, డిసెంబరు 27న ఫ్రాన్స్‌లోని జురాలో ఉన్న డోల్‌లో జన్మించారు. ఆయన 1848లో అణు అసౌష్టవాన్ని కనుక్కున్నారు. 1857లో కిణ్వ ప్రక్రియను కనుక్కున్నారు. ఫంగస్‌ రాజ్యానికి చెందిన ఈస్ట్‌ అనే సూక్ష్మజీవి చక్కెరను ఆల్కహాల్‌గా మారుస్తుందని పాశ్చర్‌ నిరూపించారు. 1865-68 కాలంలో పట్టుపురుగు వ్యాధులపై పరిశోధన చేశారు.
  • పాశ్చర్‌ పరిశోధనలు సూక్ష్మజీవి సిద్ధాంతానికి (germ theory) కీలకమైన ఆధారాలు అందించాయి. టీకాల సూత్రాలను స్థాపించాయి. పాశ్చరైజేషన్‌ అనే సాంకేతికతను రూపొందించాయి. ఇవన్నీ లక్షలాది ప్రాణాలను కాపాడాయి. పాశ్చర్‌ను ఆధునిక బ్యాక్టీరియాలజీ వ్యవస్థాపకుడిగానూ పరిగణిస్తారు. ఈయన 1895, సెప్టెంబరు 28న ఫ్రాన్స్‌లోని మార్నెస్‌ లా కోక్వెట్‌లో మరణించారు. 

వరల్డ్‌ రేబిస్‌ డే

రేబిస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన లూయిస్‌ పాశ్చర్‌ మరణించిన రోజుకు గుర్తుగా ఏటా సెప్టెంబరు 28న ‘వరల్డ్‌ రేబిస్‌ డే’గా నిర్వహిస్తారు. రేబిస్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యవంతులను చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రేబిస్‌ కారణంగా ఏటా 59 వేలమంది మరణిస్తున్నారు.

చారిత్రక నేపథ్యం

రేబిస్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే లక్ష్యంతో సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అమెరికా, అలయెన్స్‌ ఫర్‌ రేబిస్‌ కంట్రోల్, డబ్ల్యూహెచ్‌ఓ సంయుక్తంగా ‘వరల్డ్‌ రేబిస్‌ డే’ను ఏర్పాటు చేశాయి. 2007, సెప్టెంబరు 28న దీన్ని మొదటిసారి నిర్వహించారు. 2026 నినాదం: “Stronger Together”

ముఖ్యమైన పరిశోధనలు - ఆవిష్కరణలు, అవార్డులు - గౌరవాలు తదితర సమాచారంతోపాటు గతంలో తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, టీఎస్‌పీఎస్సీ స్టెనో, టైపిస్ట్‌ & జూనియర్‌ అసిస్టెంట్, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. రేబిస్‌ టీకాను కింది ఏ శాస్త్రవేత్త కనుక్కున్నారు?

(తెలంగాణ పీఎస్సి  ప్రిలిమ్స్, 2016)

1) జె.జె.బైర్డ్‌                      2) లూయిస్‌ పాశ్చర్‌

3) జాన్‌ గుటెన్‌బర్గ్‌                 4) విలియం హార్వే

సమాధానం: 2

2. రేబిస్‌ అనేది ఏ జంతు కాటు వల్ల వచ్చే వ్యాధి?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారి ఉమ్మడి పరీక్ష, 2023)

1) కుక్క    2) ఆవు    3) గేదె    4) గుర్రం

సమాధానం: 1

3. లూయిస్‌ పాశ్చర్‌ కింది దేన్ని కనుక్కోవడం ద్వారా ప్రసిద్ధి చెందారు?

(రైల్వే టైర్‌ 1, 2016)

1) పోలియో టీకా                2) చికెన్‌పాక్స్‌ టీకా

3) మశూచి టీకా             4) రేబిస్‌ టీకా

సమాధానం: 4

4. ప్రపంచ రేబిస్‌ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2021)

1) సెప్టెంబరు 25               2) సెప్టెంబరు 26

3) సెప్టెంబరు 27               4) సెప్టెంబరు 28

సమాధానం: 4

5. Who is known as the Father of Medical Microbiology?
(CDS GK, 2020)
1) Louis Pasteur        2) M.O.P. Iyengar        
3) Hugo de Vries        4) Francis Galton
Ans: 1
6. Who among the following discovered vaccination against anthrax?
(UGC NET, 2025)
1) Maurice Hilleman            2) Edward Jenner
3) Robert Koch                4) Louis Pasteur
5) None of the above/ More than one of the above
Ans: 4
7. In which year did Louis Pasteur discover that yeast is responsible for producing alcohol from sugar?
(SSC JE Mechanical, 2024)
1) 1830         2) 1857         3) 1891         4) 1904
Ans: 2 
8. Who developed the technique of preserving the quality of food by raising its temperature to prevent microbial growth in the food?  
(SSC CHSL Tier-I, 2024)
1) Antonie van Leeuwenhoek        2) Robert Koch
3) Louis Pasteur                4) Joseph Lister
Ans: 3


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram