ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఏపీజే అబ్దుల్‌ కలాం 

భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో అబ్దుల్‌ కలాం ఒకరు. మన శాస్త్ర సాంకేతికత, విజ్ఞానశాస్త్ర రంగాల పురోగతికి ఎంతగానో పాటుపడ్డారు.


భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో అబ్దుల్‌ కలాం ఒకరు. మన శాస్త్ర సాంకేతికత, విజ్ఞానశాస్త్ర రంగాల పురోగతికి ఎంతగానో పాటుపడ్డారు. అంతరిక్ష, రక్షణ రంగాల్లో అనేక పరిశోధనలు చేశారు. భారత క్షిపణి, అణ్వాయుధ కార్యక్రమాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. భారతదేశ మొదటి స్వదేశీ లాంచ్‌ వెహికల్‌ అయిన ఎస్‌ఎల్‌వీ-3, బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ రూపకల్పన ఈయన కృషి ఫలితమే. ఇస్రో, డీఆర్‌డీఓ పురోగతికి శ్రమించారు. ఈయన్ను ‘మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తారు. శాస్త్రవేత్తగానే కాక రాష్ట్రపతిగానూ పని చేసి ‘పీపుల్స్‌ ప్రెసిడెంట్‌’గా కీర్తిని గడించారు. అక్టోబరు 15న అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఈయన జీవితంలో ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

  • కలాం పూర్తి పేరు అవుల్‌ పకీర్‌ జైనులబ్దీన్ అబ్దుల్‌ కలాం. 1931, అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చదివేందుకు 1955లో మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చేరారు. 1958లో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రొడక్షన్‌ (ఎయిర్‌)లో సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌గా చేరారు.
  • కలాం 1960లో బెంగళూరులో డిఫెన్స్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)కి చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో శాస్త్రవేత్తగా చేరారు. భారత సైన్యం కోసం ఒక చిన్న హోవర్‌క్రాఫ్ట్‌/ హెలికాప్టర్‌ నమూనాను రూపొందించారు. 1969లో ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)కి బదిలీ అయ్యారు. విక్రమ్‌ సారాభాయ్‌ మార్గదర్శకత్వంలో ‘ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్‌)’లో చేరారు.
  • మొదటి స్వదేశీ లాంచ్‌ వెహికల్‌ అయిన ఎస్‌ఎల్‌వీ-3కి కలాం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇది 1980లో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) ప్రాజెక్ట్‌ అభివృద్ధిలోనూ పనిచేశారు. 1970 దశకంలో బాలిస్టిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ డెవిల్, ప్రాజెక్ట్‌ వాలియంట్‌కు కలాం మార్గదర్శకత్వం వహించారు.
  • 1982లో కలాం తిరిగి డీఆర్‌డీఓలో చేరారు. వివిధ క్షిపణుల తయారీపై పరిశోధనలు చేశారు. 1992-99 వరకు ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా, డీఆర్‌డీఓ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఎల్‌సీఏ) ప్రాజెక్టులో చురుగ్గా పాల్గొన్నారు. 1999 నుంచి 2001 వరకు ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఆ సమయంలోనే ‘టెక్నాలజీ విజన్‌ 2020’ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు.
  • పనిలోనే తనకు నిజమైన ఆనందం ఉందని కలాం ఎప్పుడూ చెప్పేవారు. స్వతహాగా శాస్త్రవేత్త అయినప్పటికీ ఆయన ఆధ్యాత్మికతను విశ్వసించారు. దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు, కళాశాలలు తిరిగి స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన 2015, జులై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు.
కలాం చేసిన ముఖ్యమైన పరిశోధనలు, రాష్ట్రపతిగా పని చేసిన కాలం, ఆయన పొందిన పురస్కారాలు - గౌరవాలు, రచనలు లాంటి ముఖ్య సమాచారంతోపాటు గతంలో తెలంగాణ హైకోర్ట్‌ రికార్డ్‌ అసిస్టెంట్, ఏపీ పోలీస్‌ ఎస్‌ఐ ప్రిలిమినరీ, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన 65కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఏపీజే అబ్దుల్‌ కలాం ఒక ప్రసిద్ధ....

(డబ్ల్యూబీపీఎస్సీ ఫుడ్‌ ఎస్‌ఐ, 2024)

1) కళాకారుడు               2) శాస్త్రవేత్త

3) కెమిస్ట్‌                  4) నటుడు

సమాధానం: 2

2. ఇండోమిటబుల్‌ స్పిరిట్‌ అనే పుస్తకాన్ని రచించింది?

(టీఎస్‌పీఎస్సీ ఏఈఈ, 2015)

1) స్వామి వివేకానంద    2) ఏపీజే అబ్దుల్‌ కలాం

3) బాబా రామ్‌దేవ్‌      4) శివానంద

సమాధానం: 2

3. ‘మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ అని కింది ఎవర్ని పిలుస్తారు?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2019)

1) హోమీ జహంగీర్‌ భాభా            2) డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌

3) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌        4) డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం

సమాధానం: 4

4. ఏపీజే అబ్దుల్‌ కలాం భారతదేశానికి ఎన్నో రాష్ట్రపతిగా పనిచేశారు?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారీ కంబైన్డ్‌ ఎగ్జామ్, 2023)

1) 11వ    2) 13వ   3) 14వ    4) 9వ

సమాధానం: 1

5. Which of the given options is the most logical sequencing of the following sentences to form a meaningful paragraph?
i. He has inspired millions through his speeches and writings.
ii. He came to be known as the "Missile Man of India" for his contributions.
iii. In the year 2002, he became the President of India.
iv. Dr. A.P.J. Abdul Kalam worked as a scientist at ISRO for forty years.
(SSC Stenographer, 2025)
1) ii-iv-iii-i        2) iv-ii-iii-i        3) i-ii-iii-iv        4) iv-iii-ii-i
Ans: 2
6. Which of the following books is NOT written by Dr. APJ Abdul Kalam?
(RRB NTPC CBT-I, 2021)
1) The Discovery of India
2) India 2020: A Vision for the New Millennium
3) Ignited Minds: Unleashing the Power Within India
4) Wings of Fire: An Autobiography
Ans: 1
7. Which musical instrument Dr APJ Abdul Kalam, former President of India, used to play?
(SSC CHSL Exam Tier-I,  2023)
1) Guitar        2) Sarod        3) Veena        4) Piano
Ans: 3
8. The following award was not presented to Abdul Kalam.
(AP Police Constable Mains, 2019)
1) Padma Sri        2) Padma Bhushan        
3) Padma Vibhushan    4) Bharata Ratna
Ans: 1
9. As per the announcement by Dr APJ Abdul Kalam Technical University (AKTU), the new AI-based attendance mechanism is being initially implemented as a pilot project during which examinations?
(SSC MTS, 2024)
1) BTech examinations            2) MBA examinations
3) MTech examinations            4) MCA examinations
Ans: 3
10. Who served as the 11th President of India from 2002 to 2007?
(SSC GD Constable, 2026)
1) Pratibha Patil                2) Pranab Mukherjee
3) A. P. J. Abdul Kalam            4) Shankar Dayal Sharma
Ans: 3


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram