ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

మాక్స్‌ ప్లాంక్‌

మాక్స్‌ప్లాంక్‌ ప్రఖ్యాత జర్మన్‌ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఫిజిక్స్‌లో కీలకమైన క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని తర్వాతే భౌతికశాస్త్రంలో జరుగుతున్న అభివృద్ధిని కలిపి ఆధునిక భౌతికశాస్త్రంగా పరిశోధకులు నిర్వచించారు


మాక్స్‌ ప్లాంక్‌ ప్రఖ్యాత జర్మన్‌ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఫిజిక్స్‌లో కీలకమైన క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని తర్వాతే భౌతికశాస్త్రంలో జరుగుతున్న అభివృద్ధిని కలిపి ఆధునిక భౌతికశాస్త్రంగా పరిశోధకులు నిర్వచించారు. అందుకే మాక్స్‌ను ‘ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడు’, ‘క్వాంటం సిద్ధాంత పితామహుడు’ అంటారు. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకుగానూ ఆయనకు భౌతికశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. ఈయన నిర్వహించిన అనేక ప్రయోగాలు, ప్రతిపాదించిన విషయాలు భౌతికశాస్త్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. అక్టోబరు 4న మాక్స్‌ప్లాంక్‌ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

  • మాక్స్‌ ప్లాంక్‌ అసలు పేరు మాక్స్‌ కార్ల్‌ ఎర్నెస్ట్‌ లుడ్విగ్‌ ప్లాంక్‌. 1858, ఏప్రిల్‌ 23న జర్మనీలోని కీల్‌లో జన్మించారు. తన గురువైన హెర్మాన్‌ ముల్లర్‌ బోధనలతో ప్లాంక్‌కు భౌతికశాస్త్రంపై ఆసక్తి ఏర్పడింది. మాక్స్‌ ప్లాంక్‌ ‘ప్రిన్సిపల్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎనర్జీ సూత్రాన్ని’ ముల్లర్‌ నుంచే నేర్చుకున్నారు. 1874లో భౌతికశాస్త్రాన్ని అభ్యసించేందుకు ఆయన మ్యూనిచ్‌ విశ్వవిద్యాలయంలో చేరారు.  
  • 1899లో ప్లాంక్‌ యూనిట్స్‌ను (ప్రమాణాలను) ప్రతిపాదించారు. ఇవి మానవ నిర్మిత వస్తువుల ఆధారంగా కాకుండా, పూర్తిగా ప్రకృతిలోని ప్రాథమిక భౌతిక స్థిరాంకాల ద్వారా నిర్వచించిన సహజ ప్రమాణాల వ్యవస్థ. 1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం వివిధ పరమాణువులు శక్తిని కేవలం నిర్దిష్ట ప్రమాణాల్లో మాత్రమే విడుదల చేస్తాయి లేదా గ్రహిస్తాయి.
  • విద్యుదయస్కాంత వికిరణం రూపంలో విడుదలయ్యే లేదా గ్రహించే అత్యల్ప శక్తి పరిమాణాన్ని ‘క్వాంటం’ అంటారు. గ్రహించిన లేదా విడుదలైన వికిరణం శక్తి, ఆ వికిరణం పౌనఃపున్యానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ క్వాంటాలు E = hf అనే సూత్రాన్ని సంతృప్తిపరిచాయి. ఇక్కడ E అనేది క్వాంటం శక్తి, h అనేది ప్లాంక్‌ స్థిరాంకం, f అనేది వికిరణ పౌనఃపున్యం. 

చివరగా

మాక్స్‌ ప్లాంక్‌ పరిశోధనలు ఫిజిక్స్‌లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి.    శక్తి క్వాంటైజేషన్‌పై ఆయన చేసిన పరిశోధనలు క్వాంటం మెకానిక్స్‌ ఆవిర్భావానికి దోహదపడ్డాయి. ఆయన 1947, అక్టోబరు 4న మరణించారు. ప్లాంక్‌ మరణానంతరం ఆయన గౌరవార్థం కైజర్‌ విల్హెల్మ్‌ సొసైటీ పేరును మాక్స్‌ప్లాంక్‌ సొసైటీగా మార్చారు. ప్రస్తుతం దీని కింద వివిధ శాస్త్రీయ విభాగాలను సూచించే 83 సంస్థలు ఉన్నాయి.

మాక్స్‌ ప్లాంక్‌ ముఖ్యమైన ఆవిష్కరణలు - పరిశోధనలు, ప్రధాన రచనలు, పొందిన అవార్డులు - గౌరవాలు ఇతర విశేషాలతోపాటు యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, టీఎస్‌ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. మరిన్ని వివరాలకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్లాంక్‌ నియమం కింది ఏ రేడియేషన్‌ స్పెక్ట్రమ్‌ను వివరిస్తుంది?

(బీడీఎల్‌ ఎంటీ మెకానికల్, 2022)

1) వైట్‌బాడీ              2) ఏదీకాదు

3) గ్రేబాడీ                4) బ్లాక్‌బాడీ

సమాధానం: 4

 2. మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2017)

1) జర్మనీ             2) అమెరికా            3) రష్యా      4) ఏదీకాదు

సమాధానం: 1

3. క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?

(ఏఏఐ ఏటీసీ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్, 2015)

1) ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌                2) మాక్స్‌ ప్లాంక్‌

3) హైసెన్‌బర్గ్‌                   4) మాక్స్‌వెల్‌

సమాధానం: 2

4. మాక్స్‌ ప్లాంక్‌ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రారంభ బిందువుగా ఉపయోగించి కింది ఎవరు ఫోటో ఎలక్ట్రిక్‌ ప్రభావాన్ని వివరించారు?

(దిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్, 2022)

1) ఫారడే                 2) ఎడిసన్‌

3) ఫ్రాంక్లిన్‌                4) ఐన్‌స్టీన్‌

సమాధానం: 4

5. According to Kelvin Planck's statement of second law of thermodynamics, which of the following statements is correct?
(RSMSSB Lab Assistant, Paper II, 2022)
1) Heat from a cold reservoir can be transferred to hot reservoir without external work.
2) Efficiency for a reversible engine is equal to 1.
3) Heat from a hot reservoir can be completely converted into work.
4) Efficiency of heat engine is less than 1.
Ans: 4
6. Who is the founder of quantum theory of radiation?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Plank        2) Einstein            3) S N Bose            4) Bohr
Ans: 1
7. Planck's constant has the same unit as:
(DSSSB AE (Civil), 2024)
1) force × time        2) force × speed        
3) force × distance        4) force × distance × time
Ans: 4
8. Observe the following statements
Statement-I : Rutherford model of an atom cannot explain the stability of an atom
Statement-II: The wavelength of X-rays is higher than the wavelength of microwaves
The correct answer is
(TS EAPCET - Engineering, 2025)
1) Statement I is not correct, but statement II is correct
2) Statement I is correct, but statement II is not correct
3) Both statements I and II are correct
4) Both statements I and II are not correct
Ans: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram