ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

మాక్స్‌ ప్లాంక్‌

ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్‌ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.


ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ప్లాంక్‌ క్రీ.శ.1900లో క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని తర్వాతే భౌతికశాస్త్రంలో జరుగుతున్న అభివృద్ధిని కలిపి ఆధునిక భౌతికశాస్త్రంగా పిలుస్తున్నారు. అందుకే మాక్స్‌ ప్లాంక్‌ను ‘ఆధునిక భౌతికశాస్త్ర పితామహుడు’ అని పిలుస్తారు. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు ఆయనకు నోబెల్‌ బహుమతి లభించింది. ఆయన ప్రవేశపెట్టిన క్వాంటైజ్డ్‌ ఎనర్జీ అనే భావన పరమాణు, ఉప-పరమాణు స్థాయుల్లో శక్తి ప్రవర్తనపై విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సంప్రదాయ సిద్ధాంత అవధులు దాటి భౌతికశాస్త్రాన్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లిన మాక్స్‌ ప్లాంక్‌ జయంతి ఏప్రిల్‌ 23న. ఈ సందర్భంగా పోటీ పరీక్షల కోణంలో ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.

బాల్యం - వృత్తి జీవితం

  • పూర్తి పేరు మాక్స్‌ కార్ల్‌ ఎర్నెస్ట్‌ లుడ్విగ్‌ ప్లాంక్‌. 1858, ఏప్రిల్‌ 23న జర్మనీలోని కీల్‌లో జన్మించారు. 1867లో ఆయన కుటుంబం కీల్‌ నుంచి మ్యూనిచ్‌కు తరలి వెళ్లింది. మ్యూనిచ్‌లోని మాక్సిమిలియన్‌ జిమ్నాసియంలో పాఠశాల విద్యను అభ్యసించారు. అక్కడ పనిచేసే హెర్మన్‌ ముల్లర్‌ అనే గణిత, భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ప్లాంక్‌కు మార్గదర్శకత్వం చేశారు. ఆయన ప్రభావంతోనే ప్లాంక్‌కు ఫిజిక్స్‌పై ఆసక్తి ఏర్పడింది
  • 1874లో మ్యూనిచ్‌ యూనివర్సిటీలో చేరి భౌతికశాస్త్రం అభ్యసించారు. అక్కడ ప్రొఫెసర్‌ ఫిలిప్‌ వాన్‌ జాలీ పర్యవేక్షణలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.
  • 1877లో ప్లాంక్‌ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తలైన వాన్‌ హెల్మ్‌హోల్ట్జ్, గుస్తాన్‌ కిర్కాఫ్‌; గణిత శాస్త్రవేత్త అయిన కార్ల్‌ వీర్‌స్ట్రాస్‌ వద్ద ఏడాది అధ్యయనం చేసేందుకు బెర్లిన్‌ యూనివర్సిటీకి వెళ్లారు.

అవార్డులు - గౌరవాలు

  • 1894లో ఆయన ప్రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో సభ్యుడిగా చేరారు. 1912-38 వరకు దానికి శాశ్వత కార్యదర్శిగా పనిచేశారు.
  • 1926లో రాయల్‌ సొసైటీ విదేశీ సభ్యుడిగా ఎన్నికయ్యారు
  • 1927లో ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఫ్రాంక్లిన్‌ పతకం పొందారు.
  • 1929లో రాయల్‌ నెదర్లాండ్స్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ నుంచి లొరెంజ్‌ మెడల్‌ పొందారు
  • రాయల్‌ సొసైటీ 1929లో కోప్లీ మెడల్‌ ప్రదానం చేసింది.
  • 1937లో రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ ఫోలో అయ్యారు
  • ప్లాంక్‌ కృషి ఫలితంగా విజ్ఞానశాస్త్రంలో సాధించిన అద్భుత పురోగతికి 1945 నుంచి గోథే బహుమతి అందుకున్నారు. 

చివరగా..

  • 20వ శతాబ్దంలో ప్రపంచంలోనే ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తల్లో ఒకరిగా మాక్స్‌ ప్లాంక్‌ కీర్తి గడించారు. 1905లో ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతాన్ని (theory of special relativity) సమర్థించిన మొదటి భౌతిక శాస్త్రవేత్త ఈయనే. నిరంతరం విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి పాటుపడుతూ ఆధునిక భౌతికశాస్త్రానికి ఆద్యుడిగా నిలిచారు. క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ద్వారా పదార్థం, శక్తి ప్రవర్తనను అతి సూక్ష్మ స్థాయిలో అన్వేషించే అవకాశం కలిగింది. ఇది ఎందరో శాస్త్రవేత్తలకు ప్రయోగాల్లో మార్గదర్శకంగా నిలిచింది. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?(ఏఏఐ ఏటీసీ జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ 2015)

1) అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌           2) మాక్స్‌ ప్లాంక్‌

3) హైసెన్‌బర్గ్‌            4) మాక్స్‌వెల్‌

సమాధానం: 2

2. ప్లాంక్‌ విద్యుదయస్కాంత వికిరణంలోని క్వాంటం సిద్ధాంతాన్ని ప్రారంభ బిందువుగా ఉపయోగించి, కింది ఎవరు కాంతి విద్యుత్‌ ప్రభావాన్ని వివరించారు?(దిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్, 2022)

1) ఎడిసన్‌        2) ఫ్రాంక్లిన్‌

3) ఫారడే        4) ఐన్‌స్టీన్‌

సమాధానం: 4

3. Which of the following scientists won the Nobel prize in Physics in 1918 for the discovery of ‘Energy Quanta’?(SSC CHSL 2020)

1. Werner Heisenberg            2. Louis de Broglie

3. James Chadwick              4. Max Karl Ernst Ludwig Planck

Answer: 4

4. Who is the exponent of Quantum theory?(SSC MTS 2017)

1. G.S.Ohm         2. Newton

3. Max Planck        4. J. S. Fleming

Answer: 3

5. The quantum theory of light was given by ________.(RRB ALP 2018)

1. Einstein                2. Planck

3. Newton                4. Faraday

Answer: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram