ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

జేమ్స్‌ పార్కిన్సన్‌

ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త. నాడీ సంబంధ రుగ్మతలపై పరిశోధనలు చేశారు. తన వద్దకు వచ్చే కొందరు రోగుల్లో ఒకే రకమైన అనియంత్రిత వణుకు, కండరాల బలహీనత లాంటి లక్షణాలు ఉండటాన్ని గమనించి, దాని గురించి తెలుసుకోవాలని భావించారు


ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, శాస్త్రవేత్త. నాడీ సంబంధ రుగ్మతలపై పరిశోధనలు చేశారు. తన వద్దకు వచ్చే కొందరు రోగుల్లో ఒకే రకమైన అనియంత్రిత వణుకు, కండరాల బలహీనత లాంటి లక్షణాలు ఉండటాన్ని గమనించి, దాని గురించి తెలుసుకోవాలని భావించారు. 1817లో తాను రచించిన ‘యాన్‌ ఎస్సే ఆన్‌ ది షేకింగ్‌ పాల్సీ’ అనే గ్రంథంలో ఆ వ్యాధి లక్షణాలు, దశల గురించి వివరించారు. దానికి ఆయన ‘పెరాలసిస్‌ అజిటాన్స్‌’/ ‘షేకింగ్‌ పాల్సీ’ అని పేరు పెట్టారు. ఆయన మరణానంతరం ఆ వ్యాధి పేరును పార్కిన్సన్స్‌గా మార్చారు. ఆయన జయంతి రోజైన ఏప్రిల్‌ 11న ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్‌ పార్కిన్సన్స్‌ డే’గా నిర్వహిస్తారు. 

బాల్యం - వృత్తి జీవితం

  • జేమ్స్‌ పార్కిన్సన్‌ 1755, ఏప్రిల్‌ 11న లండన్‌లోని షోర్డిచ్‌లో జన్మించారు. తండ్రి జాన్‌ పార్కిన్సన్‌ ప్రముఖ వైద్యుడు, ఔషధ వ్యాపారి. చిన్నతనంలో ఆయన వద్దే విద్యను అభ్యసించారు. తండ్రిలాగానే వైద్యుడు కావాలని భావించి, 16 ఏళ్ల వయసులో జాన్‌ వద్ద వైద్య శిక్షణలో అప్రెంటిస్‌గా చేరారు.
  • 1776లో అధికారికంగా మెడిసిన్‌ చదివేందుకు లండన్‌ హాస్పిటల్‌ మెడికల్‌ కాలేజీలో చేరారు. అక్కడ రిచర్డ్‌ గ్రైండాల్‌ అనే సర్జన్‌ వద్ద సహాయకుడిగా పనిచేశారు. 1784లో ఆయనకు కంపెనీ ఆఫ్‌ సర్జన్స్‌ (రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌) డిప్లొమా లభించింది.
  • 1786లో పార్కిన్సన్‌ షోర్డిచ్‌లోని హాక్స్‌టన్‌లో సర్జన్‌ - అపోథెకరీగా ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. దశాబ్దాల పాటు అక్కడే పనిచేశారు. 

ముఖ్యమైన పరిశోధనలు..

  • 1804-11 మధ్య శిలాజాలపై విస్తృత పరిశోధనలు జరిపి, మూడు సంపుటాల గ్రంథం  'Organic Remains of a Former World' రచించారు. దీన్ని ‘ఓరిక్టాలజీ’ అంటారు.
  • కీళ్ల వద్ద ఏర్పడే గడ్డలు (joint nodes), ఆహార నియమాలపై అధ్యయనం చేసి 1805లో Observations on the Nature and Cure of Gout పేరుతో గ్రంథస్థం చేశారు.
  • 1812లో అపెండిసైటిస్, దాని సమస్యల గురించి మొదటిసారి ఆంగ్లభాషలో అత్యంత వివరణాత్మకంగా వర్ణించారు. 

పార్కిన్సన్‌ వ్యాధి గుర్తింపు..

  • 1817లో పార్కిన్సన్‌ తన వద్దకు వచ్చే రోగుల్లో కొందరు ఒకేలాంటి వణుకుడు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
  • వారంతా విశ్రాంతి సమయంలో తల - కాళ్లు - చేతులు - దవడ వణుకు, నిదానంగా మాట్లాడటం, కండరాల బిగువు, అసాధారణ నడక లాంటి సారూప్య లక్షణాలతో ఉన్నారని గమనించారు. వారు ఒకే వ్యాధితో బాధపడుతున్నారని వెల్లడించారు.
  • ఈ వ్యాధిలో వివిధ దశలు ఉంటాయని పేర్కొంటూ, త్వరగా ముదిరిపోతుందని వెల్లడించారు. దీన్ని ఇతర వణుకు వ్యాధుల నుంచి వేరు చేస్తూ, ఒక ప్రత్యేక నాడీ సంబంధ రుగ్మతగా గుర్తించారు. దీనికి ఆయన ‘పెరాలసిస్‌ అజిటాన్స్‌’/ ‘షేకింగ్‌ పాల్సీ’ అని పేరు పెట్టారు. ఈ విషయాలన్నింటినీ ఆయన ‘యాన్‌ ఎస్సే ఆన్‌ ది షేకింగ్‌ పాల్సీ’ అనే గ్రంథంలో వివరించారు.
  • ఆయన రోగుల మెదడును పరీక్షించి వీటిని చెప్పలేదు. కేవలం లక్షణాల ఆధారంగానే వర్ణించారు. 

చివరగా..

ఇతర వణుకు వ్యాధుల్లా కాకుండా పార్కిన్సన్‌ ప్రత్యేకమైందని జేెమ్స్‌ పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాధి లక్షణాలు, వివిధ దశలను వివరించారు. ఈ వ్యాధి నిర్వహణలో ఆయన పరిశోధనలు ముఖ్య పాత్ర పోషించాయి. శిలాజాలపై ఆయన చేసిన పరిశోధనలు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. ఆయన గ్రంథస్థం చేసిన పరిశోధనలు ఎందరికో మార్గదర్శకమయ్యాయి. జేమ్స్‌ పార్కిన్సన్‌ 1824, డిసెంబరు 21న లండన్‌లో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. మెదడులోని కింది ఏ రసాయనం లోపం వల్ల పార్కిన్సన్‌ వ్యాధి వస్తుంది?

(హెచ్‌పీఎస్‌ఎస్‌సీ స్టాఫ్‌ నర్స్, 2021)

1) ఎసిటైల్‌కోలైన్‌            2) డోపమిన్‌

3) సెరటోనిన్‌            4) గాబా

సమాధానం: 2

2. వరల్డ్‌ పార్కిన్సన్స్‌ డేను ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2018)

1) ఏప్రిల్‌ 9               2) ఏప్రిల్‌ 10

3) ఏప్రిల్‌ 11               4) ఏప్రిల్‌ 12

సమాధానం: 3

3. పార్కిన్సన్స్‌ వ్యాధి మానవుల్లో కింది ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ, 2018)

1) ఊపిరితిత్తులు               2) మెదడు

3) గుండె                     4) మూత్రపిండాలు

సమాధానం: 2

4. Drug of choice in the treatment of cardiogenic shock is
(ISRO Pharmacist, 2017)
1) Diosgenin            2) Epinephrine
3) Dopamine            4) Ouabain
Ans: 3
5. Which of the following is called a ‘pleasure chemical’ in the human body? 
(JSSC Grade A Nurse, 2022)
1) Noradrenaline            2) Dopamine
3) Cortisol                    4) Epinephrine
Ans:  2
6. Quick response to stress is done by
(Bihar Secondary Teacher (Science), 2023)
1) androgen             2) epinephrine 
3) corticosteroid            4) More than one of the above
5) None of the above 
Ans: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram