ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ సీబీఆర్‌ఈ తాజాగా విడుదల చేసిన ‘ది పాలసీ అడ్వాంటేజ్-పవరింగ్ ఇండియాస్ జీసీసీ గ్రోత్’ నివేదిక ప్రకారం.. ఏఐ ఉద్యోగాల కల్పనలో భారత్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశంగా అవతరించింది. కేవలం డేటా ప్రాసెసింగ్, సపోర్ట్ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా.. అప్లికేషన్ లేయర్ ఏఐ, మోడల్ ఇంజినీరింగ్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఏఐ రంగంలో మైలురాళ్లు..
దేశంలోని 1,200 పైగా జీసీసీలు ఏఐ/ఎంఎల్ సేవలు అందిస్తున్నాయి.
కేవలం ఏఐ/ఎంఎల్ పరిశోధనలు, ఆవిష్కరణల కోసం 250 కంటే ఎక్కువ జీసీసీలు సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేశాయి.
భారత్‌లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ప్రస్తుతం 2.5 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన నిపుణులు సేవలు అందిస్తున్నారు.