భారత సంతతి వ్యవస్థాపకులకు విదేశాల్లోని ప్రస్తుత, అంతక్రితం యూనికార్న్‌లలో ఉన్న షేర్ల విలువ 560 బి. డాలర్ల(సుమారు రూ.53.2 లక్షల కోట్లు)గా ఉంది. తాము రూపొందించిన కొత్త ఇండియన్ డయాస్పోరా ఇండెక్స్ ద్వారా ప్రోసస్, డీల్‌రూమ్ వీటిని లెక్కించారు. ప్రతీ కంపెనీ విలువను, వ్యవస్థాపకుల మధ్య సమానంగా విభజించి అందులో ఉన్న భారతీయ వ్యవస్థాపకులను ఈ సూచీ పరిగణనలోకి తీసుకుంది.
భారత్‌లోని 102 యూనికార్న్‌లలో భారత సంతతి వ్యవస్థాపకులు 349 బి. డాలర్ల విలువైన షేర్లను కలిగి ఉన్నారు. ఇందులో ఫ్లిప్‌కార్ట్(36 బి. డాలర్లు), జొమాటో(30. బి.డాలర్లు), గ్రో(16 బి. డాలర్లు)లలో ఎక్కువ షేర్లున్నాయి.