సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్‌ ఉత్పత్తి

సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్‌ ఉత్పత్తి
  • హైదరాబాద్‌కు చెందిన భారతీయ రసాయన సాంకేతికత సంస్థ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు సూర్యరశ్మిని ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ‘జెడ్‌ఐఎఫ్‌-8 నానో హైబ్రిడ్స్‌’ అనే అత్యాధునిక పదార్థాలను అభివృద్ధి చేశారు. రసాయన చర్యలను వేగవంతం చేసే అద్భుతమైన గుణాలను ఇది కలిగి ఉందని వారు తెలిపారు. ఈ కొత్త పద్ధతిలో కేవలం సూర్యరశ్మిని వాడుకుని నీటి నుంచి లేదా ఇతర వనరుల నుంచి హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చని నిరూపించారు. 
  • ఈ పదార్థాల తయారీలో వాటి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఏఐ/ఎంఎల్, డెన్సిటీ ఫంక్షనల్‌ థియరీ(డీఎఫ్‌టీ)  సాంకేతికతను వినియోగించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram