భార్గవాస్త్ర

భార్గవాస్త్ర

శత్రు దేశాల డ్రోన్ల సమూహాలను తుత్తునియలు చేసే స్వదేశీ రక్షణ కవచం భార్గవాస్త్ర తుదిరూపు సంతరించుకుంది. దేశీయ రక్షణ రంగంలో కీలక అడుగుగా భావిస్తున్న ఈ అస్త్రంపై ఇటీవల నాగ్‌పుర్‌లో డెమో కార్యక్రమం జరిగింది. శత్రు దేశాల డ్రోన్లను అడ్డుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా దీన్ని భావిస్తున్నారు.

  • భార్గవాస్త్ర అనేది ఒక వాహనానికి అమర్చిన సమీకృత వ్యవస్థ. రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్‌ (ఈవో, ఐఆర్‌) సెన్సర్లు, పాసివ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లలతో కూడిన వ్యవస్థలను కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానించి ఉంటుంది. - దానికి తోడుగా లాంఛింగ్‌ వాహనం ఉంటుంది. దాంట్లో లాంఛ్‌ ట్యూబ్‌లు ఉంటాయి. వాటిద్వారా డ్రోన్లు, క్షిపణుల ప్రయోగానికి వీలవుతుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram