జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్స్‌

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అడ్మిషన్స్‌

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) 2026 సంవత్సరానికి గాను రెండేళ్ల ఫుల్-టైమ్ సెల్ఫ్-ఫైనాన్స్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

వివరాలు:

  • 2 ఏళ్ల ఫుల్-టైమ్ (సెల్ఫ్-ఫైనాన్స్) మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA) కోర్సు 2026

సబ్జెక్టుల వారీగా సీట్లు:

ఎంఎఫ్‌ఏ (అప్లైడ్ ఆర్ట్ & విజువల్ కమ్యూనికేషన్): 20 సీట్లు

ఎంఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ & మీడియా కమ్యూనికేషన్): 15 సీట్లు

ఎంఎఫ్‌ఏ (పెయింటింగ్): 15 సీట్లు

ఎంఎఫ్‌ఏ (స్కల్ప్చర్): 6 సీట్లు

అర్హతలు: అభ్యర్థులు సంబంధిత విభాగాంలో (అప్లైడ్ ఆర్ట్, ఫొటోగ్రఫీ, పెయింటింగ్ లేదా స్కల్ప్చర్) 4ఏళ్ల బీఎఫ్‌ఏ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఫొటోగ్రఫీలో మూడేళ్ల బీఎఫ్‌ఏ చేసిన అభ్యర్థులకు డిగ్రీ తర్వాత 3 సంవత్సరాల ప్రాక్టికల్ అనుభవం ఉన్నవారు కూడా అర్హులే.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు నింపిన దరఖాస్తు ఫారాన్ని, అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్, దరఖాస్తు రుసుము డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను విశ్వవిద్యాలయ కార్యాలయంలో నేరుగా సమర్పించాలి. ఎంఎఫ్‌ఏ స్కల్ప్చర్ కోర్సుకి దరఖాస్తు చేసేవారు ఫొటోలను (5"x7" సైజు, అటెస్టెడ్) దరఖాస్తుతో పాటు జతచేయాలి.

పరీక్షా కేంద్రం: ప్రవేశ పరీక్ష కేవలం జేఎన్‌ఎఫ్‌ఏయూ క్యాంపస్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్.

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ: 12-10-2026 ఆలస్య రుసుముతో (రూ.2,000): 17-10-2026.

Website: https://jnafau.ac.in/notification/mfa-admissions-2026/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram