హైదరాబాద్‌ ఐఐసీటీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌ ఐఐసీటీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 51

వివరాలు:

  • ప్రాజెక్ట్ అసోసియేట్-I: 32

  • ప్రాజెక్ట్ అసోసియేట్-II: 11

  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 05

  • ప్రాజెక్ట్ అసిస్టెంట్-II: 02

  • ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01

అర్హత: పోస్టును బట్టి ఎంఈ/ఎంటెక్‌, బీఎస్సీ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, పీహెచ్‌డీతో పాటు ఉద్యోగానుభవం నెట్‌/గేట్‌ వంటి అర్హతలు కూడా అవసరం.

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.20,000 నుంచి రూ.49,000 వరకు ఉంటుంది.

గరిష్ఠ వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 29, 30.09.2026

వేదిక: సీఎస్‌ఐఆర్‌ ఐఐసీటీ, హైదరాబాద్‌.

Website: https://www.iict.res.in/CAREERS

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram