ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌

ఈయన స్కాట్లాండ్‌కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త, వైద్యుడు. సూక్షజీవులపై అనేక పరిశోధనలు చేశారు


ఈయన స్కాట్లాండ్‌కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త, వైద్యుడు. సూక్షజీవులపై అనేక పరిశోధనలు చేశారు. ప్రపంచ మొట్టమొదటి యాంటీబయాటిక్‌ అయిన పెన్సిలిన్‌ను కనిపెట్టారు. క్షయ, న్యుమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి ఇది మానవాళిని రక్షిస్తోంది. ఈ ఆవిష్కరణకు ఫ్లెమింగ్‌కు నోబెల్‌ బహుమతి లభించింది.  ఆధునిక వైద్యశాస్త్ర అభివృద్ధికి ఆయన పరిశోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి. బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, కీమోథెరపీ గురించి అనేక వ్యాసాలు రాశారు. మార్చి 11న అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ వర్ధంతి సందర్భంగా పోటీపరీక్షల కోణంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

  • ఫ్లెమింగ్‌ స్కాట్లాండ్‌లోని డార్వెల్‌లో 1881, ఆగస్టు 6న జన్మించారు. పాఠశాల విద్యను లౌడౌర్‌ మూర్‌ స్కూల్, డార్వెల్‌ స్కూల్‌లో చదివారు. చదువులో మంచి ప్రతిభ కనబరచి, 1893లో ప్రఖ్యాత కిల్మార్నాక్‌ అకాడమీలో చదివేందుకు రెండేళ్ల స్కాలర్‌షిప్‌ పొందారు.
  • 1895లో పాలిటెక్నిక్‌ కోసం లండన్‌ వెళ్లి రాయల్‌ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌మిన్‌స్టర్‌)లో చేరారు. అయితే ఆర్థిక కారణాలతో ఆయన చదువుకు దూరమై కొన్నేళ్లు లండన్‌లోని షిప్పింగ్‌ ఆఫీస్‌లో పనిచేశారు.
  • 1901లో ఫ్లెమింగ్‌కు తన మేనమామ జాన్‌ ఫ్లెమింగ్‌ నుంచి కొంత మొత్తం వారసత్వంగా లభించింది. ఆయన ఆ సొమ్ముతో చదువుకోవాలని భావించారు.
  • వైద్య విద్యను అభ్యసించాలనే కోరికతో 1903లో పాడింగ్టన్‌లోని సెయింట్‌ మేరీస్‌ హాస్పిటల్‌ మెడికల్‌ స్కూల్‌లో (ప్రస్తుతం ఇది ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో భాగం) చేరారు. 1906లో డిస్టింక్షన్‌తో ఎంబీబీఎస్‌ డిగ్రీ పొందారు. అయితే వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేసే బదులు వైద్య రంగంలో పరిశోధనలు చేయాలని భావించారు.

పరిశోధనలు

  • గాయాలను శుభ్రపరిచేందుకు వాడే రసాయనాలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని ఫ్లెమింగ్‌ నిరూపించారు. ఈ అనుభవాల దృష్ట్యా విషరహిత యాంటీ బ్యాక్టీరియల్‌ మందులు అవసరమని భావించిన ఆయన, ఆ దిశగా ప్రయోగాలు చేశారు.
  • 1927లో ఫ్లెమింగ్‌ స్టెఫైలో కోకి (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఒకరోజు ఆయన ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రను భద్రపరచడం మర్చిపోయి బయటే ఉంచారు. తర్వాతి రోజు వాతావరణ ప్రభావం వల్ల పాత్రలో నీలి రంగులో బూజు లాంటి పదార్థం (ఫంగస్‌) ఉండటాన్ని గమనించారు. ఆ బూజు ఉన్న ప్రాంతంలో సూక్ష్మజీవులు నాశనమైనట్లు గుర్తించారు. ఆ పదార్థాన్ని వేరు చేసి, పెన్సిలిన్‌ అనే పేరు పెట్టారు. ఇది మొదటి యాంటీబయాటిక్‌గా పేరొందింది. 

అవార్డులు - గౌరవాలు

  • 1909లో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఫెలో; 1946లో రాయల్‌ సొసైటీ ఫెలో; 1944లో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఫెలోగా నియమితులయ్యారు.
  • 1944లో కింగ్‌ జార్జ్‌ జుఖి నైట్‌ మెడల్‌ను బహూకరించారు. అదే ఏడాది జా స్కాట్‌ అవార్డు పొందారు.
  • 1945లో ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం నుంచి కామెరాన్‌ బహుమతి, రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ నుంచి మోక్సన్‌ పతకం అందుకున్నారు.
  • 1946లో ఫ్రెంచ్‌ అకాడమీ నేషనల్‌ మెడిసిన్‌లో గౌరవ విదేశీ సభ్యుడిగా నియమితులయ్యారు.
  • 1946లో రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ నుంచి ఆల్బర్ట్‌ మెడల్‌ పొందారు. 

చివరగా..

ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపాల్సి వచ్చినా.. పరిస్థితులు కుదుటపడగానే ఆయన తన లక్ష్యం చేరడంపై దృష్టి సారించారు. వైద్యవిద్యను అభ్యసించి, పరిశోధన రంగాన్ని ఎంచుకుని వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవుల నుంచి మనుషుల ప్రాణాలను కాపాడటంలో ముఖ్య భూమిక పోషించారు. ఫ్లెమింగ్‌ ఆవిష్కరించిన పెన్సిలిన్‌ సూక్ష్మజీవశాస్త్రంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. యాంటీబయాటిక్స్‌ యుగానికి నాందిగా నిలిచింది. ఎన్నో ఇతర పరిశోధనలకు ప్రేరణగా మారింది. గతంలో ప్రాణాంతకంగా ఉన్న ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాలను గణనీయంగా తగ్గించడంలో సాయం చేసింది. ఆయన 1955 మార్చి 11న లండన్‌లో మరణించారు.

గత పరీక్షల్లో అడిగిన  ప్రశ్నలు

1. అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ కింది వాటిలో దేనిపై పరిశోధనలు చేశారు?

(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఫారెస్ట్‌ గార్డ్, 2024)

1) ఫెర్మెంటేషన్‌

2) స్మాల్‌ పాక్స్‌ టీకా అభివృద్ధి

3) పెన్సిలిన్‌ ఆవిష్కరణ

4) డీఎన్‌ఏ నిర్మాణం

సమాధానం: 3

2. మొదటి యాంటీబయాటిక్‌ ‘పెన్సిలిన్‌’ను ఎవరు కనుక్కున్నారు?

(ఎస్‌ఎస్‌సీ జేఈ, 2020)

1) జేమ్స్‌ వాట్సన్‌            2) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌

3) ఫ్రాన్సిస్‌ క్రిక్‌            4) హెన్రీ మోస్లే

సమాధానం: 2

3. Lysozyme is found in (UP LT Grade Teacher (Biology) 2018)
1) tear            2) sweat
3) saliva            4) All of the above
Ans: 4
4. Which of the following statements regarding Alexander Fleming is/are correct?
(MPPSC General Studies 2016)
1) He discovered lysozyme in 1922.
2) He discovered penicillin in 1928.
3) He coined the term "chemotherapy."
Select the correct option from the codes given below:
1) 1 & 2           2) 2 only
3) 2 & 3           4) All are correct
Ans: 1
5. Read the following paragraph.
"In 1929, Alexander Fleming was working on a culture of disease-causing bacteria. Suddenly, he found the spores of a little green mould in one of his culture plates. He noticed that the presence of this mould prevented the growth of bacteria. In fact, it also killed many of these bacteria. From this mould, penicillin was prepared."
Which of the following understanding(s) about the development of scientific knowledge is conveyed in this paragraph?
A. Science proceeds systematically according to pre-determined steps.
B. Science requires careful observation
(CTET Paper 2 Maths & Science 6th Jan 2022)
1) Only A        2) Only B
3) A & B        4) Neither A nor B
Ans: 2


Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram