హైదరాబాద్‌ విలీన దినోత్సవం

హైదరాబాద్‌ విలీన దినోత్సవం

బ్రిటిష్‌ ఇండియాలో అతిపెద్ద సంస్థానంగా వెలుగొందిన హైదరాబాద్‌ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా 13 నెలల పాటు నిజాం పాలనలోనే ఉంది. ఆ సమయంలో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఈ ప్రాంతాన్ని పాలించారు. భారత్‌లో విలీనం కావాలని రాజ్య ప్రజలు కోరుకున్నా పాలకులు ఒప్పుకోలేదు. ఖాసిం రజ్వీ నాయకత్వంలోని మజ్లిస్‌ ఇత్తెహాద్‌ ఉల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం)కు అనుబంధంగా ఉన్న సాయుధ సంస్థ ‘రజాకార్ల వ్యవస్థ’ వల్ల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అరాచకాలు ప్రజ్వరిల్లి, మానవ హక్కులు పూర్తిగా నశించాయి. మతతత్వం రాజ్యమేలింది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో రాజ్యంలో శాంతిస్థాపన కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో పోలీస్‌ చర్య చేపట్టింది. ఫలితంగా 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైంది. పోటీపరీక్షల కోణంలో హైదరాబాద్‌ విలీనానికి సంబంధించి ముఖ్య విశేషాలు తెలుసుకుందాం..!

  • వింధ్య పర్వతాలకు దక్షిణంగా 82,698 చదరపు మైళ్ల విస్తీర్ణంతో పంచకోణ ఆకృతిలో హైదరాబాద్‌ రాజ్యం ఉండేది. హైదరాబాద్‌ రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉండేవి. దీన్ని 1724 నుంచి 1948 వరకు అసఫ్‌జాహీ రాజులు పాలించారు. క్రీ.శ.1724లో అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించిన నిజాం-ఉల్‌-ముల్క్‌ మొగల్‌ చక్రవర్తికి సామంతుడిగా పాలించాడు. క్రీ.శ.1797లో భారత గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన వెల్లస్లీ భారతదేశంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు.
  • అసఫ్‌జాహీ రెండో పాలకుడైన నిజాం అలీఖాన్‌ ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందంపై 1798లో సంతకం చేశాడు. ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న తొలి స్వదేశీ పాలకుడు నిజాం అలీఖానే. దీనివల్ల హైదరాబాద్‌ రాజ్యం ఒక ప్రిన్స్‌లీ స్టేట్‌గా మారి 1947 వరకు బ్రిటిషర్ల ఆధిపత్యంలో కొనసాగింది. మొత్తం జనాభాలో 85% హిందువులే. వీరిలో ప్రధానంగా తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడే వర్గాలుండేవి. 
  • 1940ల నాటికి హైదరాబాద్‌లో భాషా ఉద్యమాలు, భూ ఉద్యమాలు, కమ్యూనిస్టుల పోరాటాలు, ప్రజాస్వామ్య సంస్కరణల డిమాండ్‌లు ఊపందుకున్నాయి. 1945 చివరల్లో జాగీర్దారీ విధానానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు అనుబంధంగా ఉన్న కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ నాయకత్వంలో తిరుగుబాటు చెలరేగింది. దీన్ని అణిచేందుకు నిజాం రజాకార్లను ఉపయోగించాడు. దీంతో రాజ్యవ్యాప్తంగా శాంతిభద్రతలు క్షీణించాయి.
  • 1947 స్వాతంత్య్ర చట్టం, ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రంతోపాటు దేశంలోని స్వదేశీ సంస్థానాలు లేదా రాజ్యాలు తమ ఇష్టానుసారం స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగే లేదా భారత్‌/ పాకిస్థాన్‌లో విలీనమయ్యే స్వేచ్ఛను కల్పించింది. నాటి భారత ఉపప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కృషి ఫలితంగా దేశంలోని మొత్తం 562 స్వదేశీ సంస్థానాల్లో నాలుగు మినహా మిగిలినవన్నీ భారత్‌లో విలీనమయ్యాయి. ఆ నాలుగు: ట్రావెన్‌ కోర్, హైదరాబాద్, జమ్మూ-కశ్మీర్, జునాగఢ్‌.
  • నాటి హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ భారతదేశంలో విలీనమవడానికి నిరాకరించి, హైదరాబాద్‌ సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుందని ప్రకటించాడు. దానికి అనుగుణంగా భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం (స్టాండ్‌స్టిల్‌ అగ్రిమెంట్‌) కుదుర్చుకున్నాడు. దీనిపై నాటి భారతదేశ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌ బాటన్, హైదరాబాద్‌ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌లు 1947 నవంబరు 29న సంతకాలు చేశారు.
  • తర్వాతి కాలంలో హైదరాబాద్, భారత ప్రభుత్వం మధ్య సంబంధాలు క్షీణించాయి. రాజ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు, హింస చెలరేగాయి. ఎక్కువ శాతం ప్రజలు భారత్‌లో విలీనం కావాలని కోరుకున్నారు. వారంతా నిజాం పాలనను వ్యతిరేకించారు. అంతర్గత అసమ్మతి బాగా పెరిగింది. ఎక్కడ చూసినా అశాంతి చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ పోలో’తో హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేయాలని భావించింది. 
ఆపరేషన్‌ పోలో ముఖ్యాంశాలు, విలీనం తర్వాత హైదరాబాద్, ఎన్నికలు,ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ సాకారం తదితర సమాచారంతోపాటు గతంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ - ప్రిలిమ్స్, మెయిన్స్, తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్, తెలంగాణ హైకోర్ట్‌ జూనియర్‌ అసిస్టెంట్, టీజీపీఎస్సీ ఏఈఈ, ఏపీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ప్రిలిమ్స్, ఏపీ హైకోర్ట్‌ అసిస్టెంట్‌ ఎగ్జామినర్, ఏపీ పంచాయత్‌ సెక్రటరీ మొదలైన పరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 65కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. హైదరాబాద్‌ విలీనానికి భారత ప్రభుత్వం చేపట్టిన సైనికచర్య పేరు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2025)

1) ఆపరేషన్‌ షీల్డ్‌             2) ఆపరేషన్‌ పీస్‌

3) ఆపరేషన్‌ పోలో            4) ఆపరేషన్‌ లోటస్‌

సమాధానం: 3

2. హైదరాబాద్‌ రాజ్యంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం కింది ఏ తేదీన పోలీస్‌ చర్య చేపట్టింది?

(ఉత్తరాఖండ్‌ పట్వారీ, 2023)

1) సెప్టెంబరు 13               2) సెప్టెంబరు 17

3) సెప్టెంబరు 18                4) జనవరి 26

సమాధానం: 1

3. భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్యం ఎప్పుడు విలీనమైంది?

(ఎంపీటెట్, 2023)

1) 1947, ఆగస్టు                 2) 1947, సెప్టెంబరు

3) 1948, నవంబరు           4) 1948, సెప్టెంబరు

సమాధానం: 4

4. 1724లో స్వతంత్ర హైదరాబాద్‌ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు?

(యూజీసీ నెట్, 2021)

1) ముబ్రిజ్‌ ఖాన్‌                2) అసఫ్‌ జా

3) అలీవర్దీ ఖాన్‌                4) షౌకత్‌ జంగ్‌

సమాధానం: 2

5. The Nizam of Hyderabad accepted British subsidiary alliance under ________________. 
(RRB NTPC (UG), 2025)
1) Sir John Shore        2) Lord Hastings
3) Lord Cornwallis    4) Lord Wellesley
Ans: 4
6. What was the name of the operation carried out by the Indian forces in September 1948 to restore peace and tranquility in Hyderabad? 
(UGC NET, 2025) 
1) Operation Meghdoot         2) Operation Cactus Lily 
3) Operation Polo             4) Operation Vijay 
Ans: 3
7. Which of the following operations led to the integration of the princely state of Hyderabad into the Indian Union?
(DSSSB MTS, 2026)
1) Operation Vijay            2) Operation Polo
3) Operation Meghdoot        4) Operation Pawan
Ans: 2
8. Operation Polo is related to
(Agniveer Army GD, 2024)
1) Liberation of Goa            2) Accession of Jodhpur
3) Annexation of Hyderabad        4) Settlement with Mizoram
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram