సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత (యూవీ) కిరణాలు భూమిపై నేరుగా పడకుండా ఓజోన్ పొర రక్షణ కల్పిస్తుంది. భూతలం నుంచి 18 నుంచి 50 కి.మీ. వరకు ఉన్న ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణం అంటారు. ఇందులో 25 - 40 కి.మీ. మధ్య ఒక దట్టమైన పొర ఉంటుంది. దీన్నే ఓజోన్ పొర అంటారు. మానవ చర్యల ఫలితంగా వాతావరణంలోని ఈ సహజసిద్ధ పొర సన్నగిల్లుతోంది. దీంతో భూమిపై జీవరాశులు యూవీ కిరణాల దుష్ప్రభావానికి గురవుతున్నాయి. ఓజోన్ పొర సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 16న ‘ప్రపంచ ఓజోన్ దినోత్సవం’గా(World Ozone Day) నిర్వహిస్తారు. దీన్నే ‘అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం’ (International Day for the Preservation of the Ozone Layer) అని కూడా అంటారు. ఓజోన్ పొర క్షీణత గురించి కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడంతోపాటు దీని రక్షణకు చేపట్టిన పరిష్కార మార్గాలను చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
| మాంట్రియల్ ప్రొటోకాల్, బహుళపక్ష నిధి, కిగాలి సవరణ తదితర ముఖ్యాంశాలతోపాటు ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్సీ స్టెనో, టైపిస్ట్ & జూనియర్ అసిస్టెంట్, ఏపీసెట్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 90కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’లో అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(యూపీఎస్సీ సివిల్ సర్వీస్, 2014), (డబ్ల్యూబీసీఎస్ ప్రిలిమ్స్ 2017), (ఎంపీఎస్సీ ప్రిలిమ్స్, 2018), (యూకేపీఎస్సీ ప్రిలిమ్స్, 2022),
(యూపీ టీజీటీ బయాలజీ, 2009), (ఎంపీ పోలీస్ ఎస్‌ఐ, 2016), (యూపీపీఎస్సీ కంబైన్డ్ స్టేట్ ఎగ్జామ్, 2021), (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పట్వారీ, 2019),
(త్రిపుర టెట్, 2019), (ఆర్‌ఆర్‌బీ జేఈ, 2019)
1) సెప్టెంబరు 16 2) ఏప్రిల్ 21
3) డిసెంబరు 25 4) జనవరి 30
సమాధానం: 1
2. ఓజోన్ క్షీణత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?
(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2019)
1) ఉష్ణమండల ప్రాంతాలు 2) భూమధ్యరేఖ
3) ధృవాలు 4) మహాసముద్రాలు
సమాధానం: 3
3. ఓజోన్ కింది ఏ ఆవరణంలో అధికంగా ఉంటుంది?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021)
1) స్ట్రాటో ఆవరణం 2) హైడ్రో ఆవరణం
3) ట్రోపో ఆవరణం 4) మీసో ఆవరణం
సమాధానం: 1
4. మాంట్రియల్ ప్రొటోకాల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
(ఎంపీటెట్, 2022)
1) 1985 2) 1987 3) 1988 4) 1989
సమాధానం: 4
5. The themes for World Ozone Day consistently highlight the success and future potential of which specific international treaty that governs the phase-out of ozone-depleting substances?
(Delhi Police Constable (Executive), 2025)
1) Vienna Convention 2) Kyoto Protocol
3) Paris Agreement 4) Montreal Protocol
Ans: 4
6. Which of the following is an ozone-depleting substance?
(UGC NET, 2021)
1) Sulphur dioxide 2) Methyl chloride
3) Carbon dioxide 4) Methane
Ans: 2
7. On 16 September 2025, World Ozone Day was observed under which theme?
(RRB NTPC (UG) CBT-I, 2026)
1) Montreal Protocol: Our Shield, Our Future
2) Ozone for Life
3) From Science to Global Action
4) Global Cooperation Protecting Life on Earth
Ans: 3
8. Where is ozone approximately found in the atmosphere and what is its primary role?
(MP Police SI, 2026)
1) 50 - 100 km, producing ultraviolet radiation
2) Above 100 km, stabilizing ultraviolet radiation
3) 0 - 10 km, greenhouse warming
4) 10 - 50 km, absorbing harmful ultraviolet radiation
Ans: 4