ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) దినోత్సవం

ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ధూళి, ఇతర కాలుష్య కారకాలు దీనికి ప్రధాన కారణాలు. వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం ప్రత్యామ్నాయ మార్గం. ప్రయాణ సమయంలో ఇవి ఎలాంటి శబ్దం చేయవు, వీటి నుంచి పొగ విడుదల కాదు, సంప్రదాయ ఇంధన వాహనాలతో పోలిస్తే ఈవీల నిర్వహణ వ్యయం తక్కువ. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 9న ‘ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) దినోత్సవం’ (World Electric Vehicle - EV Day)గా నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటిని ఉపయోగించడం ఎంతో ముఖ్యం. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఎలక్ట్రిక్‌ వాహనాల పాత్రను తెలపడంతోపాటు వీటి వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను ప్రజలకు వివరించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • గ్యాసోలిన్‌ (పెట్రోల్‌) లేదా డీజిల్‌ లాంటి శిలాజ ఇంధనాలతో నడిచే సంప్రదాయ అంతర్గత దహన యంత్రాలపై (internal combustion engines) ఆధారపడకుండా పూర్తిగా లేదా పాక్షికంగా విద్యుత్‌తో నడిచే వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీలు) అంటారు. ఇవి సున్నా ఉద్గారాలను విడుదల చేస్తూ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడతాయి.  
  • ఈవీలు ఎలక్ట్రిక్‌ మోటార్‌కు శక్తిని అందించడానికి ఒక పెద్ద ట్రాక్షన్‌ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తాయి. వాహనాన్ని నడపడానికి అవసరమైన శక్తిని మోటార్‌ అందిస్తుంది. ఇవి విద్యుత్‌తో నడుస్తాయి కాబట్టి వాహనం టెయిల్‌పైప్‌ నుంచి ఎలాంటి పొగ రాదు. వీటిలో ఫ్యూయల్‌ లైన్‌ లేదా ఫ్యూయల్‌ ట్యాంక్‌ లాంటి సాధారణ ఇంధన భాగాలు ఉండవు.
  • భారత్‌లోనూ ఈవీల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర, త్రిచక్ర, ప్రయాణికుల, వాణిజ్య వాహనాల విభాగాల్లో మొత్తం 24.4 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. 2024-25లో ఈ సంఖ్య 19.6 లక్షల యూనిట్లుగా ఉంది. ద్విచక్ర వాహనాల విభాగం నుంచి 2024-25లో 11.5 లక్షల యూనిట్లు విక్రయమవగా, 2025-26లో ఆ సంఖ్య 14 లక్షల యూనిట్లుగా ఉంది.
  • త్రిచక్ర వాహనాల విషయానికొస్తే 2024-25లో 7 లక్షల యూనిట్లు అమ్ముడవగా, 2025-26లో ఆ సంఖ్య 8.3 లక్షల యూనిట్లుగా ఉంది. ఎలక్ట్రిక్‌ కార్లు 2024-25లో 1.1 లక్షల యూనిట్లు అమ్ముడవగా, 2025-26లో అమ్మకాలు దాదాపు 2 లక్షల యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విభాగంలో ఈవీ అమ్మకాలు 19,454గా నమోదయ్యాయి (2025-25లో). 2024-25లో ఆ సంఖ్య 8820 యూనిట్లుగా ఉంది.

చారిత్రక నేపథ్యం

గ్రీన్‌ టీవీ వ్యవస్థాపకుడైన అడే థామస్‌ విశ్వవ్యాప్తంగా ఏటా సెప్టెంబరు 9న ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈవీ ఛార్జింగ్‌ కంపెనీ అయిన ఏబీబీ దీనికి భాగస్వామిగా ఉంది. అలా 2020లో మొదటిసారి దీన్ని నిర్వహించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, పర్యావరణంపై అవి చూపే ప్రయోజనాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. తర్వాతి కాలంలో ప్రపంచ దేశాలన్నీ దీన్ని నిర్వహించడం ప్రారంభించాయి. 

ఈవీల్లో రకాలు, విద్యుత్‌ వాహనాల చరిత్ర, ఫేమ్‌ ఇండియా స్కీం, పీఎం ఇ-డ్రైవ్‌ పథకం, పీఎం ఇ-బస్‌ సేవా స్కీం, ఇంకా ఇతర ప్రభుత్వ పథకాలతోపాటు గతంలో ఐబీపీఎస్‌ క్లర్క్‌ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌ స్కేల్‌-1 మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ మెయిన్స్, ఎస్‌బీఐ పీవో మెయిన్స్, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 50కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’లో  అందుబాటులో ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. శూన్య ఉద్గారాల (జీరో ఎమిషన్స్‌) కోసం ప్రజా రవాణా వ్యవస్థల్లో సాధారణంగా ఏ రకమైన వాహనాన్ని ఉపయోగిస్తారు?

(ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్, 2025)

1) డీజిల్‌ బస్సులు             2) ఎలక్ట్రిక్‌ బస్సులు

3) పెట్రోల్‌ కార్లు              4) హైబ్రిడ్‌ వాహనాలు

సమాధానం: 2

2. భారత ప్రభుత్వం ఫేమ్‌ ఇండియా పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చింది?

(ఆర్‌పీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 2021)

1) 2014, ఏప్రిల్‌ 1            2) 2015, ఏప్రిల్‌ 1

3) 2016, ఏప్రిల్‌ 1            4) 2017, ఏప్రిల్‌ 1

సమాధానం: 2

3. ప్రపంచ ఈవీ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ డీఓఈ పీఆర్‌టీ, 2022),

(సీటెట్‌ (లెవల్‌ 2) సోషల్‌ స్టడీస్, 2024)

1) సెప్టెంబరు 12               2) సెప్టెంబరు 9

3) సెప్టెంబరు 8                4) సెప్టెంబరు 6

సమాధానం: 2

4. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మిషన్‌ ప్లాన్‌ (ఎన్‌ఈఎంఎంపీ)’ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది?

(ఎస్‌ఎస్‌సీ జేఈ సీఈ, 2019)

1) 2013   2) 2015   3) 2016   4) 2017

సమాధానం: 1

5. Which scheme was extended until March 2028 to promote electric vehicle adoption by Government of India?
(DSSSB MTS, 2026)
1) PM Gati Shakti Scheme        2) National Green Highways Mission
3) PM E-Drive subsidy scheme        4) One Nation One EV Policy
Ans: 3
6. The Union Cabinet chaired by the Prime Minister of India, has approved a bus scheme "PM - eBus Sewa" for augmenting city bus operation by _______ e-buses on PPP model.
(SSC GD Constable, 2024)
1) 5000        2) 10000        3) 11000        4) 7000
Ans: 2
7. Which of the following Indian States/Union Territories launched Electric Vehical Policy on 7th August, 2020?
(UPPSC Civil Services, 2020)
1) Madhya Pradesh        2) Uttar Pradesh        3) Delhi        4) Tamil Nadu
Ans: 3
8. Which Indian state's/Union Territory's government has announced its Electric Vehicle (EV) Policy 2.0 to reduce air pollution in the region? 
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Assam        2) Delhi        3) Uttar Pradesh        4) Chandigarh
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram