అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, సమర్థవంతంగా మాట్లాడటం - వినగల సామర్థ్యంతో మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. ఈ సామర్థ్యం ప్రాథమిక మానవ హక్కుల సాకారాన్ని సాధ్యం చేస్తుంది. అలాగే సానుకూల మానవ ప్రవర్తన, సామాజిక భాగస్వామ్యం, అభివృద్ధికి దారితీసే మార్గంగా పనిచేస్తుంది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం, ఉపయోగించడం ప్రధానం. దీన్నే డిజిటల్‌ అక్షరాస్యతగా పేర్కొంటారు. వ్యక్తులు, సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 8న ‘అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం’ (International Literacy Day)గా నిర్వహిస్తారు. అందరికీ విద్య అనే భావనను పెంపొందించడంతోపాటు ఇది అందరి ప్రాథమిక హక్కు అని చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా భారత ప్రభుత్వం ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్‌ఐఎల్‌పీ)’/ ‘అండర్‌స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ (యూఎల్‌ఎల్‌ఏఎస్‌ - ఉల్లాస్‌)’ అనే కేంద్ర ప్రాయోజిత వయోజన విద్యా పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం, ఒక నిరక్షరాస్య వ్యక్తి ‘ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ)’లో ఉత్తీర్ణత సాధిస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు.
  • 1951లో మనదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 18.3%. ఇందులో స్త్రీల అక్షరాస్యత 8.9% కాగా పురుషుల అక్షరాస్యత 27.2%. 2011 గణాంకాల ప్రకారం మనదేశ మొత్తం అక్షరాస్యత రేటు 74.04%. ఇందులో స్త్రీల అక్షరాస్యత రేటు 65.46%, పురుషుల అక్షరాస్యత 82.14 శాతంగా ఉంది. పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం, 2023-24లో భారతదేశ అక్షరాస్యత రేటు 80.8% (ఏడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో).
  • అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు - మిజోరం (98.2%), లక్షద్వీప్‌ (97.3%), కేరళ (95.3%). దీని ప్రకారం, గ్రామీణ అక్షరాస్యత రేటు 77.5%, పట్టణ అక్షరాస్యత రేటు 88.9 శాతంగా ఉన్నాయి. ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం 95% అక్షరాస్యత రేటును సాధించినప్పుడు దాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిందిగా పరిగణిస్తారు.
  • 2026, జులై నాటికి ఉల్లాస్‌ పథకం కింద మిజోరం, గోవా, త్రిపుర, హిమాచల్‌ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్‌లను అధికారికంగా సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాలుగా ప్రకటించారు. 2024, జూన్‌ 24న సంపూర్ణ అక్షరాస్యత కలిగిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ నిలిచింది. అలాగే చండీగఢ్, అండమాన్‌ అండ్‌ నికోబార్, జమ్మూ - కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాయి.

చారిత్రక నేపథ్యం

‘అందరికీ విద్య’ను ప్రోత్సహించడంతోపాటు సమావేశ లక్ష్యాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) ఏటా సెప్టెంబరు 8న ‘అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం’గా జరుపుకోవాలని 1966, అక్టోబరు 26న తీర్మానించింది. 1967 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. 

2026 నినాదం: “Literacy for people, the planet and prosperity"

ప్రాథమిక విద్యాహక్కు చట్టం - 2009, సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020, ఉల్లాస్, సాక్షర్‌ భారత్‌ మిషన్, ప్రజ్ఞాతతోపాటు గతంలో ఏపీటెట్, ఐబీపీఎస్‌ క్లర్క్‌ మెయిన్స్, యూజీసీ నెట్, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, ఆర్‌ఆర్‌బీ - ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’లో  అందుబాటులో ఉంది. ఉంది. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అక్షరాస్యత అనేది ప్రధానంగా ఏ రకమైన అభివృద్ధి సూచిక?

(ఎంపీఎస్సీ గ్రూప్‌ సి కంబైన్డ్‌ పేపర్, 2019)

1) మానవ వనరుల అభివృద్ధి            2) భౌగోళిక అభివృద్ధి

3) ఆర్థికాభివృద్ధి                    4) రాజకీయ అభివృద్ధి

సమాధానం: 1

2. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) 74.04%   2) 69.04%   3) 76.04%   4) 67.04%

సమాధానం: 1

3. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(యూపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రీ-ఎగ్జామ్, 2024), (కేఎస్‌ఈటీ, 2015), (కేవీఎస్‌ పీజీటీ సీఎస్, 2017), (కేఎస్‌పీ పోలీస్‌ (పీఎస్‌ఐ), 2020), (ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ వై, 2020),

(సీఐఎస్‌ఎఫ్‌ ఏఎస్‌ఐ, 2018), 

1) మార్చి 8     2) జూన్‌ 8        3) నవంబరు 8      4) సెప్టెంబరు 8

సమాధానం: 4

4. 1951 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత?

(ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్‌ లెవల్, 2022)

1) 18.33%      2) 20.42%        3) 19.23%       4) 24.46%

సమాధానం: 1

5. The literacy rate is defined by the percentage of the population of a given age group that can ___. 
(SSC GD Constable, 2024)
1) Read only        2) Speak        3) Read and Write        4) Write only
Ans: 3
6. What is the literacy rate of India as per the National Survey of India-2022? 
(SSC CHSL Exam Tier-I, 2024)
1) 74.2%        2) 77.7%        3) 78.3%        4) 72.1%
Ans: 2
7. Which of the following statements is correct about the literacy of India between 2001 and 2011?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) Female literacy has risen faster than male literacy.
2) Male literacy and female literacy have risen parallelly.
3) Male literacy has declined whereas female literacy has risen.
4) Male literacy has risen faster than female literacy.
Ans: 1
8. Why is literacy an important component of human development?
(RPF Constable, 2025)
1) It directly increases Gross Domestic Product.
2) It ensures higher agricultural productivity.
3) It empowers individuals to make informed decisions and improves employment opportunities.
4) It reduces population growth.
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram