భూమిపై అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో సరస్సులు ఒకటి. ఇవి సాధారణంగా మడుగులు, చెరువుల కంటే పెద్దగా, లోతుగా ఉంటాయి. సరస్సులు అనేక రకాల మొక్కలు, జలచరాలు, వన్యప్రాణులకు ఆవాసం కల్పిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీటి ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ఏటా ఆగస్టు 27న ‘ప్రపంచ సరస్సు దినోత్సవం’ (World Lake Day) నిర్వహిస్తారు. కాలుష్యాల బారి నుంచి సరస్సులను సంరక్షించడం, పునరుద్ధరించడం, స్థిరంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
సరస్సు అంటే?
మన దేశంలో ముఖ్యమైన సరస్సులు
ఊలార్ సరస్సు(Wular Lake)
జమ్మూ-కశ్మీర్‌లోని బండిపొరే (Bandipore) జిల్లాలో ఉంది. దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. జీలం నది నీరు ఈ సరస్సు మీదుగా ప్రవహిస్తోంది. దీని ముఖద్వారం వద్ద తుల్‌బుల్ ప్రాజెక్టు ఉంది. ఈ సరస్సు మధ్యలో జైనా లంక్ (Zaina Lank) అనే చిన్న ద్వీపం కూడా ఉంది. దీన్ని రాజు జైనుల్-అబి-దిన్ నిర్మించారు.
దాల్ సరస్సు
జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలో ఉంది. ఇది మంచినీటి సరస్సు. దీన్ని శ్రీనగర్ రత్నం (Srinagar’s Jewel), పుష్పాల సరస్సు (Lake of Flowers) అని పిలుస్తారు. దీని చుట్టూ పిర్ పంజాల్ పర్వత శ్రేణులు ఉన్నాయి. దీనికి నీరు ప్రధానంగా తెల్బల్ వాగు (Telbal stream) నుంచి వస్తుంది. ఈ వాగు జీలం నది నుంచి ప్రవహిస్తుంది.
లోక్‌తక్ సరస్సు
మణిపూర్‌లో ఉంది. దాదాపు 287 చ.కి.మీ. విస్తీర్ణంతో ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరొందింది. మణిపురి నది వల్ల ఏర్పడింది. దీన్ని మణిపూర్ జీవనాడి (Life line of Manipur) గా పిలుస్తారు. నీటిపై తేలుతున్న పచ్చిక భూములు (పుండీస్) ఉండటం దీని ప్రత్యేకత. ఈ ప్రాంతంలో ప్రపంచంలో ఏకైక తేలియాడే జాతీయ పార్కు అయిన కీబుల్ లామ్జావో ఉంది.
అష్టముడి సరస్సు
ఇది కేరళలోని ఉప్పునీటి సరస్సు. కల్లడి నది వల్ల ఏర్పడింది. అష్టముడి అంటే మలయాళీ భాషలో ఎనిమిది ముఖద్వారాలు కలది అని అర్థం. కేరళలోని కొల్లం, కుందర పట్టణాలు ఈ సరస్సు ఒడ్డున ఉన్నాయి. వెంబనాడ్ సరస్సు తర్వాత ఇదే కేరళలో రెండో అతిపెద్ద సరస్సు. ఈ చిత్తడి నేల 27 జాతుల పక్షులకు, 97 జాతుల చేపలకు ఆశ్రయం కల్పిస్తోంది.
చిలికా సరస్సు
మహానది డెల్టాకు దక్షిణాన ఒడిశాలో ఉంది. భారత్‌లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. అలాగే దేశంలో అతిపెద్ద తీర ప్రాంత లాగూన్ సరస్సు కూడా. ఇందులో నలబానా ద్వీపం (1987లో పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు), కాళిజై ద్వీపం, బీకన్ ద్వీపం మొదలైనవి ఉన్నాయి. చిలికా సరస్సు భారత్‌లో వలస పక్షులకు అతిపెద్ద శీతాకాల విడిది కేంద్రం. ఇది ఇరావడి డాల్ఫిన్ జనాభాకు ప్రసిద్ధి చెందింది.
చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరస్సులను రక్షించుకోవాలనే లక్ష్యంతో 1984, ఆగస్టు 27న జపాన్‌లోని షిగా ప్రిఫెక్చర్‌లో బివా సరస్సు ఒడ్డున మొదటి ‘వరల్డ్ లేక్ కాన్ఫరెన్స్’ జరిగింది. సరస్సుల నిర్వహణలో శాస్త్త్ర్రీయ విధానాలను అనుసరించాలని ఇందులో దేశాలన్నీ తీర్మానించాయి. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీని ‘ప్రపంచ సరస్సు దినోత్సవం’గా నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2024, డిసెంబరు 12న ప్రకటించింది. 2025లో మొదటిసారి దీన్ని నిర్వహించారు.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. దాల్ సరస్సు ఎక్కడ ఉంది?
(ఆర్‌ఆర్‌బీ జేఈ, 2019)
1) జమ్మూ - కశ్మీర్ 2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తర్ ప్రదేశ్ 4) గుజరాత్
సమాధానం: 1
2. కిందివాటిలో ఏది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2023)
1) బరాపానీ 2) ఊలార్
3) భీమ్‌లతాల్ 4) లోక్‌తక్
సమాధానం: 2
3. ప్రపంచ సరస్సు దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2026)
1) ఆగస్టు 27 2) మే 18
3) జులై 14 4) సెప్టెంబరు 14
సమాధానం: 1
4. భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది?
(ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఎస్‌ఐ ప్రిలిమ్స్, 2012)
1) నైనిటాల్ 2) సాంబార్
3) సిశ్రామ్ 4) చిలికా
సమాధానం: 4
5. In which Indian state is the 'Pookode Lake' located?
(SSC MTS 2021)
1) Kerala 2) Gujarat 3) Punjab 4) Tamil Nadu
Ans: 1
6. Which of the following is the largest artificial freshwater lake in India?
(RRB NTPC CBT-I, 2021)
1) Shivaji Sagar Lake 2) Nainital Lake
3) Kolleru Lake 4) Kodai Lake
Ans: 1
7. Which of the following is a freshwater lake?
(67th BPSC Prelims, 2022)
1) Chilika 2) Sambhar
3) Wular 4) Loktak
5) None of the above/More than one of the above
Ans: 5
8. Which is the correct sequence of lakes according to depth (from maximum to minimum)?
(SSC CGL Tier-I, 2023)
1) Caspian Sea > Tanganyika > Vostok > Baikal
2) Baikal > Caspian Sea > Tanganyika > Vostok
3) Baikal > Tanganyika > Caspian Sea > Vostok
4) Caspian Sea > Baikal >Tanganyika > Vostok
Ans: 3