ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఎందుకంటే 200 ఏళ్లకు పైగా ఆంగ్లేయుల పాలనలో అణచివేతకు, దోపిడీకి గురైన భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది ఈ రోజే. ప్రజలందరి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఐకమత్యానికి ప్రతిరూపంగా త్రివర్ణ జెండా రెపరెపలాడింది. ఎందరో మహనీయుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ప్రజలు బానిస సంకెళ్లను తెంచుకుని స్వతంత్ర భారతావనిలో సంబరాలు జరుపుకున్నారు. 1947, ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు. నేడు మనం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ జాతీయోద్యమంలోని ముఖ్య ఘట్టాలతోపాటు భారత స్వాతంత్య్ర చట్టం 1947 గురించి తెలుసుకుందాం..!
భారత స్వాతంత్య్ర చట్టం, 1947
ఈ చట్టం బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన ఒక చరిత్రాత్మక శాసనం. ఇది బ్రిటిష్ ఇండియాను భారతదేశం, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలుగా విభజించింది. ఈ చట్టం 1947, జులై 5న బ్రిటిష్ పార్లమెంట్, జులై 18న రాజు ఆమోదం పొందింది. భారతదేశ చివరి వైస్రాయ్ లూయిస్ మౌంట్‌బాటెన్ బ్రిటిష్ రాచరికం నుంచి అధికారాన్ని స్థానిక ప్రజలకు అప్పగించడానికి ఒక ప్రణాళిక రూపొందించారు. దీన్ని 1947, జూన్ 3న ప్రకటించారు.
| భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర, ఇతర ముఖ్యాంశాలు, దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే దేశాలు లాంటి సమాచారంతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏపీ హైకోర్ట్ స్టెనోగ్రాఫర్, ఏపీపీఎస్సీ పంచాయత్ సెక్రటరీ, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్, తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, టీఎస్‌పీఎస్‌సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, యూపీఎస్సీ సివిల్స్, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)
1) 1789, జూన్ 23 2) 1757, జూన్ 23
3) 1758, జూన్ 24 4) 1750, జూన్ 25
సమాధానం: 2
2. సహాయ నిరాకరణోద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
(ఏఎఫ్‌సీఏటీ, 2013)
1) 1900 2) 1920 3) 1940 4)1935
సమాధానం: 2
3. 1857 సిపాయి తిరుగుబాటు మే 10న ఏ ప్రాంతంలో ప్రారంభమైంది?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2025)
1) అవధ్ 2) మీరట్ 3) కాన్పూర్ 4) మైసూర్
సమాధానం: 2
4. కింది ఏ జాతీయోద్యమాన్ని వందేమాతర ఉద్యమం అని కూడా పిలుస్తారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జేఈ సీఈ, 2019)
1) సహాయ నిరాకరణోద్యమం 2) స్వదేశీ ఉద్యమం
3) హోమ్‌రూల్ ఉద్యమం 4) చంపారన్ సత్యాగ్రహం
సమాధానం: 2
5. The Indian Mutiny of 1857 effectively ended in the city of ______.
(SSC CHSL, 2021)
1) Amritsar 2) Lucknow 3) Gwalior 4) Vadodara
Ans: 3
6. During the Swadeshi Movement in Bengal, a tricolour flag was designed having colours:
(RRB NTPC CBT-I, 2021)
1) orange, white and green 2) red, green and white
3) red, green and yellow 4) green, white and yellow
Ans: 3
7. In 1905, the Swadeshi and Boycott movement was formally proclaimed in Bengal during a meeting held at:
(RRB NTPC (UG) CBT-I, 2026)
1) Nagpur Congress 2) Dacca Town Square
3) Calcutta Town Hall 4) Benaras Congress
Ans: 3
8. Which of the following institutions was set up during the Swadeshi movement?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) Bengal National College 2) Shantiniketan
3) Bethune School 4) Banaras Hindu University
Ans: 1