ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) అనేది మన దేశంలో అతిపెద్ద చమురు, గ్యాస్‌ను అన్వేషించే, ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ. ఇది భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధీనంలో పని చేస్తుంది. దేశీయ ముడి చమురు, సహజ వాయువులో దాదాపు 71% ఇదే ఉత్పత్తి చేస్తోంది. 2010 నుంచి ఈ కంపెనీ మహారత్న హోదాలో ఉంది. దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడంలోనూ ఇది ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంతటి ఘనకీర్తి కలిగిన ఈ సంస్థను భారత ప్రభుత్వం 1956, ఆగస్టు 14న ఏర్పాటు చేసింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 14న ‘ఓఎన్‌జీసీ డే’గా నిర్వహిస్తారు.
| ఓఎన్‌జీసీ కార్యకలాపాలు, ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవీఎల్), అనుబంధ ఉమ్మడి భాగస్వామ్య సంస్థల సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన 90కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కిందివాటిలో ఏది ఓఎన్‌జీసీకి చెందిన అనుబంధ సంస్థ?
(ఎస్‌ఎస్‌సీ సీపీఓ, 2020)
1) ఓఎన్‌జీసీ విదేశ్ 2) ఓఎన్‌జీసీ వినేష్
3) ఓఎన్‌జీసీ విఘ్నేష్ 4) ఓఎన్‌జీసీ విశేష్
సమాధానం: 1
2. ఓఎన్‌జీసీ దేశంలో మొదటి షెల్ గ్యాస్ నిల్వలను ఎక్కడ కనుక్కుంది?
(ఎస్‌ఎస్‌సీ సీపీలో టైర్ 1, 2019)
1) జామ్ నగర్ 2) దుర్గాపూర్
3) చండిఖోల్ 4) పదుర్
సమాధానం: 2
3. ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
(సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ ట్రేడ్స్‌మాన్, 2023)
1) 1957 2) 1959 3) 1958 4) 1956
సమాధానం: 4
4. ఆంధ్రప్రదేశ్‌లో మినరల్ ఆయిల్, సహజ వాయువు నిక్షేపాలకు అధిక అవకాశాలు ఉన్న ప్రాంతం?
(ఏపీటెట్, 2018)
1) నాగావళి - వంశధార బేసిన్ 2) కృష్ణా - గోదావరి బేసిన్
3) పెన్నా - స్వర్ణముఖి బేసిన్ 4) కావేరి - తుంగభద్ర బేసిన్
సమాధానం: 2
5. The Mumbai High Field (previously Bombay High Field) discovered by the Russian and Indian team from the seismic exploration vessel Academic Arkhangelsky in February 1974, commenced production in which year?
(RPF SI CBT-I, 2024)
1) 1975 2) 1981 3) 1976 4) 1978
Ans: 3
6. Where is the headquarters of Oil and Natural Gas Corporation located in India?
(NTPC CBT-I, 2021)
1) Rajasthan 2) Jharkhand 3) Delhi 4) Mumbai
Ans: 3
7. Which company has acquired the Government of India's entire 51.11% stake in HPCL?
(RRC Group D, 2018)
1) Indian Oil Corporation Limited (IOCL)
2) Oil and Natural Gas Corporation (ONGC)
3) Hindustan Petroleum (HP)
4) Bharat Petroleum (BP)
Ans: 2
8. Which of the following are correctly matched?
i. ONGC Videsh - South China Sea
ii. War on Terror - GCC
iii. Military strength - Element of national power
iv. The Silent Spring - Kenneth Boulding
Choose the correct answer from the options given below:
(UGC NET Paper 2: Political Science, 2022)
1) i and ii only 2) i and iii only 3) iii and iv only 4) i and iv only
Ans: 2