అంతర్జాతీయ యువజన దినోత్సవం

అంతర్జాతీయ యువజన దినోత్సవం

ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జనాభాలో ‘రోజూ కష్టపడి పనిచేసే (వర్కింగ్‌ గ్రూప్‌)’ వారి సంఖ్య ఎక్కువగా ఉండాలి. 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారు ఈ వర్గంలోకి వస్తారు. అయితే ప్రస్తుతం అనేక దేశాల్లో యువతరం సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా పెరుగుతోంది. జనన, మరణాల రేటు తగ్గడంతోపాటు అనేక ఆర్థిక, సామాజికాంశాలు దీనికి కారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా యువత సామర్థ్యాలు, విజయాలను గుర్తించే లక్ష్యంతో ఏటా ఆగస్టు 12న ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం’గా (International Youth Day) నిర్వహిస్తారు. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేయడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • ‘‘ఇతరులపై ఆధారపడే బాల్య దశ నుంచి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగే సమాజ సభ్యులే యువత’’ అని యునెస్కో నిర్వచించింది. వీరిని ‘రోజూ కష్టపడి పనిచేసే (వర్కింగ్‌ గ్రూప్‌)’గా సూచిస్తారు. చదవడం, ఉద్యోగం/ ఉపాధి, బాధ్యతలు లాంటివి ఇందులో భాగం. నేషనల్‌ యూత్‌ పాలసీ 2003 ప్రకారం, 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారిని మన దేశంలో యువతగా పేర్కొంటారు. వీరిని జాతీయ అభివృద్ధిలో క్రియాశీల భాగస్వాములుగా నిర్వచించారు.
  • ఐక్యరాజ్య సమితి ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న యువత సంఖ్య దాదాపు 130 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 2025లో 59 శాతం యువత దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తోంది. 2050 నాటికి ఆ సంఖ్య 69 శాతానికి చేరుతుందని అంచనా. అలాగే 2025 నుంచి 2050 మధ్యకాలంలో అధిక, ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో యువత జనాభా దాదాపు 24% మేర తగ్గుతుందని ఐరాస పేర్కొంది.
  • మన దేశ జనాభాలో 24% మంది 0-14 వయోవర్గంలో ఉన్నారు. 10-19 వయోవర్గంలో 17% మంది, 10-24 వయోవర్గంలో 26% మంది ఉన్నారు. దేశ జనాభాలో 68 శాతం మంది పనిచేసే (15-64 ఏళ్ల మధ్య) వయసులో ఉన్నారు. 65 సంవత్సరాలకు మించిన వయసున్న జనాభా 7 శాతం. రానున్న దశాబ్దాల్లో ఈ వయోజన జనాభా పెరగనుందని నివేదిక తెలిపింది.
  • 2025లో దేశ సగటు ఆయుర్దాయం పురుషుల్లో 71 సంవత్సరాలు, మహిళల్లో 74 సంవత్సరాలు. 2023లో జనసంఖ్యలో చైనాను భారత్‌ మించిపోయి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైంది. దేశంలో జననాల రేటు సరాసరిన ప్రతి మహిళకు 1.9కి పడిపోయిందని, జనాభా పెరుగుదలను ఇప్పటి స్థాయిలోనే కొనసాగించేందుకు అవసరమైన పెరుగుదల పడిపోయిందని నివేదిక పేర్కొంది. 

భారతదేశంలో యువజన సాధికారతకు చేపట్టిన చర్యలు, చారిత్రక నేపథ్యంతోపాటు గతంలో ఈ టాపిక్‌ గురించి ఏపీ హైకోర్ట్‌ - స్టెనోగ్రాఫర్, జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్‌ అసిస్టెంట్, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, యూజీసీ నెట్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. జాతీయ యువజన విధానం-2014లో ఏ వయసు వారిని యువతగా నిర్వచించారు?

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జైల్‌ వార్డర్, 2024)

1) 24 - 45 ఏళ్లు                2) 18 - 35 ఏళ్లు

3) 20 - 40 ఏళ్లు            4) 15 - 29 ఏళ్లు

సమాధానం: 4

2. జాతీయ ప్రమాణాలు, నాణ్యతను నిర్ధారించడానికి కింది దేనిలో ‘ఒక దేశం, ఒక ప్రమాణం’ అనే అంశాన్ని పేర్కొన్నారు?

(యూజీసీ నెట్, 2019)

1) జాతీయ విద్యా విధానం, 1968        

2) జాతీయ విద్యా విధానం, 1986

3) నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికత కోసం జాతీయ విధానం, 2015

4) నీతి ఆయోగ్‌ మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక: 2017-18 నుంచి 2019-20

సమాధానం: 3

3. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(జేకేఎస్‌ఎస్‌బీ ఎస్‌ఐ, 2022), (ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2025), 

(ఎంపీ పట్వారీ, 2017), (కేవీఎస్‌ పీఆర్‌టీ, 2017)

1) ఆగస్టు 12                2) ఏప్రిల్‌ 4

3) అక్టోబరు 23              4) డిసెంబరు 11

సమాధానం: 1

4. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023)

1) 2017   2) 2015   3) 2014   4) 2016

సమాధానం: 2
5. The National Youth Policy 2014 defines youth as population between the ages of ________ and _________.
(SSC CGL, 2024)
1) 20; 29        2) 15; 25        3) 15; 29        4) 10; 19
Ans: 3
6. The National Program for Youth and Adolescent Development (NPYAP) was launched by the Ministry of Youth Affairs and Sports of India. The scheme is for the adolescents in the age group of ________.
(DSSSB NDMC PRT, 2022)
1) 12-21 year        2) 15-18 years        3) 10-19 years        4) 8-15 years
Ans: 3
7. What was the unemployment rate among youth aged 15-29 in rural areas in May 2025, as per the PLFS?
(RRB Group D, 2025)
1) 15.2%        2) 10.5%        3) 13.7%        4) 17.9%    
Ans: 3
8. Which of the following is/are the submission /sub-missions of the National Skill Development Mission (NSDM)?
I. Institutional training    
II. Overseas employment        
III. Leveraging of public infrastructure
Select the correct answer using the code given below. 
(CDS General Knowledge, 2023)
1) I only         2) II only         3) I, II and III        4) II and III only  
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram