మొక్కలు, వ్యవసాయ, గృహ, పారిశ్రామిక జీవ వ్యర్థాల నుంచి తక్కువ వ్యవధిలో ఉత్పత్తి చేయగలిగే, మండే స్వభావం ఉన్న పదార్థాలను జీవ ఇంధనాలు (బయోఫ్యూయల్స్) అంటారు. కిణ్వన ప్రక్రియ, పైరోలైసిస్, గ్యాసిఫికేషన్, ట్రాన్స్‌ఎస్టరిఫికేషన్ అనే వివిధ రకాల ప్రక్రియల ద్వారా వీటిని తయారు చేస్తారు. పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాలు సహజ ప్రక్రియలో ఏర్పడేందుకు చాలా సమయం కావాలి. వీటి వాడకంతో గ్రీన్‌హౌస్ ఉద్గారాలతోపాటు అనేక కాలుష్య కారకాలు వాతావరణంలోకి వెలువడుతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు జీవ ఇంధనాల వాడకం తప్పనిసరి. అంతరించిపోతున్న సహజ వనరులకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాలు (బయోఫ్యూయల్స్) వాడటం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. ఇవి పర్యావరణ హితమే కాక, అత్యంత తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే పునరుత్పాదక శక్తి వనరు కూడా. జీవ ఇంధనాల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఆగస్టు 10న ‘ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం’గా (World Biofuel Day) నిర్వహిస్తారు. జీవ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రజలను చైతన్యపరచడంతోపాటు దాని వల్ల కలిగే లాభాల గురించి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
భారత్‌లో జీవ ఇంధనాల పరిణామం
చారిత్రక నేపథ్యం
జర్మనీకి చెందిన సర్ రుడాల్ఫ్ డీజిల్ అనే ఇంజినీర్ 1893, ఆగస్టు 10న వేరుశెనగ నుంచి తీసిన నూనెతో విజయవంతంగా ఒక ఇంజిన్‌ను నడిపించారు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాన్ని ఉపయోగించవచ్చని ఆయన నిరూపించారు. రుడాల్ఫ్ డీజిల్ ఇంజిన్ సృష్టికర్త కూడా. ఆయన చేసిన ప్రయోగానికి గుర్తుగా ఏటా ఆ తేదీన ప్రపంచ ‘జీవ ఇంధన దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. మన దేశంలో 2015 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు.
| జీవ ఇంధనాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, భారత్‌లో చేపట్టిన కార్యక్రమాలు - పథకాలు ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఏపీ హైకోర్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్, ఐబీపీఎస్ పీఓ మెయిన్స్, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ తదితర పరీక్షల్లో అడిగిన 80కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రెబ్ చేసుకోండి. వివరాల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కిందివాటిలో ఏది జీవ ఇంధనాల వర్గంలో భాగం కాదు?
(యూజీసీ నెట్, 2018)
1) బయో ఇథనాల్ 2) బయోడీజిల్
3) గోబర్ గ్యాస్ 4) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్
సమాధానం: 4
2. కింది ఏ ఆవిష్కర్త జ్ఞాపకార్థం ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుతారు?
(బీఎస్‌ఎన్‌ఎల్ జేఈ (టీటీఏ), 2016)
1) నికోలస్ ఓట్టో 2) జేమ్స్‌వాట్
3) రుడాల్ఫ్ డీజిల్ 4) మైఖేల్ ఫారడే
సమాధానం: 3
3. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ, 2018)
1) ఆగస్టు 10 2) జూన్ 18
3) జులై 20 4) మార్చి 10
సమాధానం: 1
4. కిందివాటిలో జీవ ఇంధనం కానిది?
(డబ్ల్యూబీసీఎస్ మెయిన్స్, 2022)
1) వెజిటబుల్ ఆయిల్ 2) గ్రీన్ డీజిల్
3) బయోగ్యాస్ 4) గ్యాసోలిన్
సమాధానం: 4
5. Which of the following is a commonly used biofuel feedstock?
(SSC GD, 2021)
1) Sugarcane 2) Limestone 3) Iron ore 4) Bauxite
Ans: 1
6. In which year was the PM JI-VAN (Biofuel-Vatra Sukla Crop Residue Removal) scheme launched?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) 2018 2) 2019 3) 2020 4) 2017
Ans: 2
7. In May 2018, the government of India approved 'National Policy on Biofuels' to promote biofuels in the country. Which of the following Indian states was the first to implement this policy?
(RRB NTPC CBT-I, 2021)
1) Rajasthan 2) Kerala 3) Himachal Pradesh 4) Goa
Ans: 1
8. Identify the correct statements about biofuels.
i. Transesterification is involved in production of biodiesel.
ii. Biogas is produced from organic wastes using aerobic bacteria.
iii. Biohydrogen can be produced using hydrogenase by microalgae.
iv. Bioethanol with high octane rating is produced using wood chips.
v. Photoautotrophic bacteria are used for bioethanol production.
Choose the correct answer from the options given below:
(UGC NET Paper 2: Environmental Sciences, 2026)
1) i, iii and iv only 2) ii, iii and v only
3) i, iii and v only 4) i, ii and iii only
Ans: 1