అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

నాగరిక సమాజానికి దూరంగా అడవులు, కొండ ప్రాంతాల్లో నివసించే వారు గిరిజనులు. వీరు ఒక ప్రాంతానికి పరిమితమై లేదా ప్రాచీన కాలం నుంచీ ఒకే ప్రదేశంలో జీవనాన్ని సాగిస్తుంటారు. అందుకే వీరిని ఆదివాసులు అని కూడా పిలుస్తారు. (వీరికి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. వేట లేదా వ్యవసాయం వీరి జీవన విధానం. ప్రపంచం ఇంత అభివృద్ధి చెందినా నేటికీ 60శాతం గిరిజనులు అరణ్యాల్లోనే ఉంటున్నారు. అడవులు, ప్రకృతి పరిరక్షణలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు.) ఆదివాసీ జాతుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఆగస్టు 9న ‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం’గా (International Day of the World’s Indigenous Peoples) నిర్వహిస్తారు. ప్రపంచీకరణ ఫలితంగా ప్రభావితమవుతోన్న ఆదివాసీ జీవనంతోపాటు వారి సంస్కృతి, హక్కులను కాపాడటం గురించి ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఆదిమవాసులు అంటే?

  • ఆదిమవాసులు అంటే ఒక నిర్దిష్ట భూభాగం లేదా ప్రాంతానికి చెందిన మూల నివాసితులు (original inhabitants). వీరు తమ పూర్వీకులకు చెందిన విలక్షణమైన సాంస్కృతిక, భాష, సామాజిక సంప్రదాయాలు కొనసాగిస్తారు. వీరు ఉండే ప్రాంతంతో లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భౌతిక సంబంధాన్ని కలిగిఉంటారు. వీరు నివసించే భూభాగాలు ప్రపంచ ఉపరితలంలో 28% మేర విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలోని అడవుల్లో 11% వీరి పరిధిలోనే ఉంది. వీరు జీవవైవిధ్యానికి ప్రధాన సంరక్షకులుగా ఉన్నారు.
    ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో ఆదివాసులు నివసిస్తున్నారు. వీరి జనాభా దాదాపు 48 కోట్లు.

భారతదేశంలో

  • మన దేశ మూలవాసులుగా పరిగణించే అనేక జాతి, గిరిజన సమూహాలను సూచించేందుకు ‘ఆదివాసి’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. వీరిని భారతదేశ అసలైన నివాసితులుగా పరిగణిస్తారు. వీరికి ప్రత్యేక సంస్కృతులు, భాషలు, ఆచారాలు ఉన్నాయి. వీరు శతాబ్దాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి తమ ప్రాంతంలోని పర్యావరణం, వనరులపై లోతైన అవగాహన ఉంటుంది.
    భారత రాజ్యాంగంలో వీరిని షెడ్యూల్డ్ తెగలుగా (ఎస్టీ) పేర్కొన్నారు. ఆర్టికల్‌ 366(25) షెడ్యూల్డ్‌ తెగలను నిర్వచిస్తుంది. షెడ్యూల్డ్‌ తెగలుగా పేర్కొన్న వర్గాలన్నింటినీ ఆర్టికల్‌ 342లో చేర్చారు. దీని ప్రకారం, షెడ్యూల్డ్‌ తెగలు లేదా గిరిజనులు అంటే గిరిజనుల్లోని కొన్ని తెగలు/ వర్గాలు లేదా అన్ని తెగలు/ వర్గాలు అని రాష్ట్రపతి ప్రకటించారు.

షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ)

  • 1950 రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం దేశంలో 744 ఎస్టీ కులాలు ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 705కు తగ్గింది. వీరు మొత్తం దేశ జనాభాలో 10.4 కోట్లు (8.6%) ఉన్నారు. 30 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్టీ జనాభా ఉన్నట్లు గుర్తించారు.
    విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వీరి అభ్యున్నతికి రాజ్యాంగంలో 7.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.

జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌

  • షెడ్యూల్డ్ తెగల సంక్షేమాన్ని పెంపొందించేందుకు, రాజ్యాంగంలో వారికి కల్పించిన రక్షణలు, సౌకర్యాలను పరిరక్షించే లక్ష్యంతో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని ఆర్టికల్‌ 338(ఏ) ప్రకారం 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 ద్వారా ఏర్పరిచారు.
    ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.
    2026, ఆగస్టు 9 నాటికి అంతర్‌ సింగ్‌ ఆర్య జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు.

చారిత్రక నేపథ్యం

  • ఆదివాసీ ప్రజల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో మొదటిసారి ఐక్యరాజ్య సమితి 1982, ఆగస్టు 9న జెనీవాలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ప్రేరణగా ఏటా ఆ తేదీన ‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం’గా నిర్వహించాలని 1994, డిసెంబరులో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది.
అత్యంత దుర్బల గిరిజన సమూహాలు, వారి అస్తిత్వానికి ఉన్న ముప్పు, 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ఎస్టీల జనాభా, భారత రాజ్యాంగం ఎస్టీల కోసం కల్పించిన ప్రాథమిక రక్షణలు, చట్ట సభల్లో రిజర్వేషన్ల వివరాలు, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం-2026 నినాదం మొదలైన విశేషాలతోపాటు గతంలో తెలంగాణ హైకోర్ట్, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్, ఏపీపీఎస్‌సీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ప్రిలిమ్స్, ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మెయిన్స్, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
(ఆర్‌ఎస్‌ఎంఎస్‌ఎస్‌బీ ఫారెస్ట్‌ గార్డ్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2026)

1) ఆగస్టు 10             2) ఆగస్టు 7

3) ఆగస్టు 8              4) ఆగస్టు 9

సమాధానం: 4

2. కింది ఏది మైనారిటీ ఆదివాసీ ప్రజల సాంస్కృతిక, రాజకీయ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది?
(ఒడిశా పోలీస్‌ ఎస్‌ఐ, 2022)

1) భావనాత్మక చట్రం            2) సామాజిక చట్రం

3) రాజకీయ చట్రం               4) ఏదీకాదు

సమాధానం: 1

3. కిందివాటిలో ఏ తెగ బాఫిన్‌ ద్వీపానికి చెందింది?
(బిహార్‌ ఎస్‌టీఈటీ పీటీటీ (జాగ్రఫీ), 2023)

1) మసాయ్‌           2) బుష్‌మన్‌

3) సమంగ్‌            4) ఎస్కిమోలు

సమాధానం: 4

4. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో గిరిజన జనాభా ఎంత?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 2, 2016)

1) 95.2 మిలియన్లు           2) 104.5 మిలియన్లు

3) 125.2 మిలియన్లు          4) 150.2 మిలియన్లు

సమాధానం: 2

5. Find correct statements about international Day of the World’s Indigenous People.
(DSSSB TGT Social Studies, 2018)

1) It is celebrated on 9th August every year.

2) The theme for 2018 was ‘Indigenous peoples’ migration and movement’.

3) Government of India and Government of Gujarat will jointly construct a museum of tribal freedom fighters at Rajpipla, Narmada District.

4) All of the above

Ans: 4

6. What was the theme of International Day of the World’s Indigenous Peoples in 2019?
(SSC JE EE, 2019)

1) Indigenous Cuisine           2) Indigenous Festivals

3) Indigenous Costume        4) Indigenous Languages

Ans: 4

7. On the occasion of World Tribal Day the foundation was laid for a bridge to be constructed on which river in Banswara district?
(RSMSSB Forest Guard (Re-Exam), 2022)

1) Haran          2) Airav/Erav         

3) Anaas         4) Chap

Ans: 1

8. The United Nations has declared 2019 as the______.
(RRB NTPC CBT-I, 2021)

1) International Year of Indigenous Languages

2) International year of Family Farming

3) International year of Plant Health

4) International Year of Sustainable Tourism for Development

Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram