భారత్‌లో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గ్రామాల్లో వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించేది ఈ రంగమే. సాధారణంగా వీటిని మగ్గాలపై నేస్తారు. వీటిపై నేసే ప్రతి వస్త్రం దేనికదే ప్రత్యేకం. మన దేశంలో వెంకటగిరి, కాంచీపురం, వారణాసి మొదలైనవి సంప్రదాయ చేనేత రకాలు. ఈ వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. మన చేనేత కళాకారులు నేసే వస్త్రాలు ఖండాంతర ఖ్యాతి గడించాయి. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచే ‘చేనేత’కు గుర్తుగా దేశవ్యాప్తంగా ఏటా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా (National Handloom Day) నిర్వహిస్తారు. ప్రజలు చేనేత ఉత్పత్తులు వాడేలా ప్రోత్సహించడం, ఈ రంగంలోని కార్మికులకు మద్దతు కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
నాటి బ్రిటిష్ రాజప్రతినిధి లార్డ్ కర్జన్ బెంగాల్‌ను రెండుగా విభజిస్తూ 1905, జులై 20న అధికారిక ప్రకటన చేశాడు. దీన్ని నిరసిస్తూ అనేక ఉద్యమాలు జరిగాయి. ఆగస్టు 7న నిర్వహించిన సభలో బెంగాల్ జాతీయవాదులంతా కర్జన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినదించారు. విదేశీ వస్తువులు బహిష్కరించి, స్వదేశీ వస్తువులు వాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే స్వదేశీ ఉద్యమానికి నాందిగా నిలిచింది. ఈ ఉద్యమ స్ఫూర్తితోనే ఏటా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా నిర్వహించాలని 2015లో భారత ప్రభుత్వం తీర్మానించింది.
| చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, భారతదేశంలో ప్రసిద్ధ చేనేత సంప్రదాయాలతోపాటు గతంలో ఈ అంశంపై తెలంగాణ హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4, యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. మన దేశంలో సిటీ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అని దేన్ని అంటారు?
(హెచ్‌టీఈటీ పీజీటీ, 2017)
1) అంబాలా 2) ఫరీదాబాద్
3) హిస్సార్ 4) పానిపట్
సమాధానం: 4
2. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ)ని ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో నెలకొల్పారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2018)
1) రెండో 2) మూడో 3) మొదటి 4) అయిదో
సమాధానం: 1
3. మన దేశంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2021), (ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021),
(ఆర్‌ఆర్‌బీ జేఈ (సివిల్ అండ్ అలైడ్ ఇంజినీరింగ్), 2026),
(సీడీఎస్, 2017), (ఎంపీ పోలీస్ ఎస్‌ఐ, 2017),
(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2017),
1) ఆగస్టు 23 2) నవంబరు 18
3) సెప్టెంబరు 15 4) ఆగస్టు 7
సమాధానం: 4
4. జాతీయ చేనేత దినోత్సవాన్ని మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు?
(ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్, 2022)
1) 2014 2) 2016 3) 2017
4) 2015 5) 2013
సమాధానం: 4
5. Which one of the following is the most important small scale industry in India?
(SSC CHSL Tier-1, 2025)
1) Handloom industry 2) Computer chips industry
3) Iron and steel industry 4) Jute industry
5) None of the above
Ans: 1
6. Which of the following statement is correct regarding Handloom sector?
I. Handloom sector is capital-intensive.
II. It requires fully skilled workers.
(SSC MTS, 2026)
1) Only I 2) Only II 3) Both I and II 4) Neither I nor II
Ans: 4
7. As per 4th Handloom survey, percentage of weavers in rural areas is
(NABARD Grade A, 2021)
1) 88.7% 2) 78.7% 3) 68.7% 4) 97.7% 5) 57.7%
Ans: 1
8. Where was the 11th National Handloom Day celebrated on 7 August 2025, where the President of India presented the Sant Kabir Handloom Awards and National Handloom Awards?
(RRB Group D, 2026)
1) India Gate Lawns, New Delhi 2) Bharat Mandapam, New Delhi
3) Rashtrapati Bhavan, New Delhi 4) Vigyan Bhavan, New Delhi
Ans: 2