ఆర్టికల్ 370 అనేది భారత రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధన. ఇది కశ్మీర్ సంస్థానానికి (జమ్మూ-కశ్మీర్) స్వయం ప్రతిపత్తి హోదా కల్పించింది. ఇది భారతదేశంలో మరే రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి లేని ప్రత్యేకతను ఆ ప్రాంతానికి అందించింది. ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో చర్చలు, వాదోపవాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అంతేకాకుండా ఇది జమ్మూ-కశ్మీర్‌పై గణనీయమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రభావాలకు కారణమైంది. చివరికి భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేసి, తద్వారా జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించింది. పోటీపరీక్షల కోణంలో ఆర్టికల్ 370 చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ నిబంధనలు, అమలు - రద్దు మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం..!
| రాజ్యాంగ నిబంధనలు, ఆర్టికల్ 370 రద్దు, సుప్రీంకోర్టు తీర్పు, ఆర్టికల్ 370 వ్యవహారంలో కీలక పరిణామాలు, రద్దు ప్రభావం తదితర ముఖ్యాంశాలతోపాటు గతంలో తెలంగాణ హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్, టీఎస్‌పీఎస్‌సీ - స్టెనో, టైపిస్ట్ & జూనియర్ అసిస్టెంట్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్ లాంటి పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారత యూనియన్‌లో జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదాను భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ కల్పించింది?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ డీఓఈ పీఆర్‌టీ, 2022), (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2023),
(యూకేపీఎస్సీ ప్రిలిమ్స్, 2016), (యూపీఆర్‌వీయూఎన్‌ఎల్ టీజీ 2 మెకానికల్ ఫిట్టర్ 2015)
1) ఆర్టికల్ 377 2) ఆర్టికల్ 380
3) ఆర్టికల్ 370 4) ఆర్టికల్ 386
సమాధానం: 3
2. జమ్మూ-కశ్మీర్ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2017)
1) 1946, ఆగస్టు 15 2) 1947, ఆగస్టు 15
3) 1957, జనవరి 15 4) 1950, జనవరి 26
సమాధానం: 3
3. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని ఎవరు రూపొందించారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020)
1) జవహర్‌లాల్ నెహ్రూ 2) రఘుబార్ దాస్
3) గోపాలస్వామి అయ్యంగార్ 4) బి.ఆర్.అంబేడ్కర్
సమాధానం: 3
4. జమ్మూ - కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగ సభ ఏ సంవత్సరంలో ఆమోదించింది?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2021)
1) 1952 2) 1949 3) 1961 4)1950
సమాధానం: 2
5. Article 370 was abrogated from the Indian Constitution in -
(UGC NET Paper 2: Political Science, 2025)
1) March 2017 2) August 2019 3) November 2017 4) July 2018
Ans: 2
6. Article 370, which granted special status to Jammu and Kashmir, was abrogated by which constitutional mechanism?
(SSC CGL 2025)
1) Presidential Order under Article 370(3)
2) Amendment by Parliament under Article 368
3) Ordinance by the President
4) Order under Article 356
Ans: 1
7. Before its repeal in 2019, which of the following was the key feature of Article 370 that gave special status to Jammu and Kashmir?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Parliament required the consent of the state government to make laws on matters in the Union List for Jammu and Kashmir.
2) The provisions of the Directive Principles of State Policy were fully applicable in the state.
3) Jammu and Kashmir had no representation in the Lok Sabha.
4) Jammu and Kashmir could not be included in the First Schedule of the Constitution.
Ans: 1