ఆర్థిక ప్రయోజనాల కోసం మనుషులను అంగడి సరకుగా మార్చి, క్రయవిక్రయాలు జరపడాన్ని మానవ అక్రమ రవాణా (Human Trafficking) అంటారు. ఇది అత్యంత దుర్మార్గమైన మానవ హక్కుల ఉల్లంఘన. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఏటా జులై 30న ‘ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’గా (World Day Against Trafficking In Persons) నిర్వహిస్తారు. మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించడంతోపాటు దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
అంతర్జాతీయంగా మానవ అక్రమ రవాణాను అడ్డుకునే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2010, జులై 30న ‘యాన్ యాక్షన్ ప్లాన్’ను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి, స్థిరమైన చర్యల ద్వారా దీన్ని నివారించాలని ప్రణాళికలో పేర్కొంది. ఈ యాక్షన్ ప్లాన్ ఆమోదానికి గుర్తుగా ఏటా జులై 30న ‘ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’గా జరుపుకోవాలని 2013లో యూఎన్‌ఓ తీర్మానించింది.
|
మానవ అక్రమ రవాణా నుంచి రక్షణ కల్పించడానికి భారత రాజ్యాంగం నిర్దేశించిన ఆర్టికల్స్, ప్రభుత్వాలు చేసిన చట్టాలు, చేపట్టిన పథకాలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, టీఎస్‌పీఎస్సీ ఏఈ, యూపీఎస్సీ సివిల్స్, అగ్నివీర్ ఆర్మీ జీడీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 85కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన పశ్నలు
1. అక్రమ రవాణా, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ ఏది?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)
1) యూఎన్‌ఓడీసీ 2) యూఎన్‌ఎఫ్‌పీఏ
3) యునిసెఫ్ 4) యూఎన్‌ఈపీ
సమాధానం: 1
2. మానవ అక్రమ రవాణా నివారణ, రక్షణ, పునరావాస బిల్లు ఏ సంవత్సరంలో చట్టంగా మారింది?
(రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్, 2020)
1) 2018 2) 2001 3) 2008 4) 1980
సమాధానం: 1
3. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎంపీ పట్వారీ, 2023), (అలహాబాద్ హైకోర్ట్ ఏఆర్‌ఓ, 2020)
1) జులై 28 2) జులై 29
3) జులై 30 4) జులై 25
సమాధానం: 3
4. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద మానవ అక్రమ రవాణా నిషేధం గురించి పొందుపరిచారు?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2022)
1) ఆర్టికల్ 22 2) ఆర్టికల్ 23
3) ఆర్టికల్ 21 4) ఆర్టికల్ 24
సమాధానం: 2
5. The 'Blue heart campaign' run by a UN institution is related to ________.
(MPSC Rajyaseva Prelims, 2022)
1) AIDS 2) Human trafficking 3) Drugs 4) Flood relief
Ans: 2
6. What percentage of all detected trafficking victims in 2022 were children, as per the Global Report on Trafficking in Persons 2024?
(RRB NTPC (UG) CBT-I, 2026)
1) 31% 2) 20% 3) 45% 4) 38%
Ans: 4
7. Which article of the Indian Constitution prohibits trafficking in human beings and forced labour?
(SSC CHSL, 2020)
1) Article 25 2) Article 23 3) Article 13 4) Article 5
Ans: 2
8. Which of the following Fundamental Rights entails trafficking of human beings and forced labour?
(SSC MTS, 2024)
1) Rights against Exploitation 2) Cultural and Educational Rights
3) Right to Equality 4) Right to Freedom
Ans: 1