పులులు జంతురాజ్యంలో అత్యంత శక్తిమంతమైన మాంసాహార జీవులు. అటవీ ఆవరణ వ్యవస్థలో వీటి పాత్ర కీలకం. అక్రమ రవాణా, వేట కారణంగా పులుల జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. అంతరించిపోయే దశలో ఉన్న పెద్ద పులుల సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జులై 29న ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం’ (International Tiger Day) నిర్వహిస్తారు. పులుల సహజ ఆవాసాలను రక్షించేలా ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టడం, వాటి రక్షణ పద్ధతులపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
టైగర్ టాస్క్ ఫోర్స్
చారిత్రక నేపథ్యం
2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో టైగర్ సమ్మిట్ జరిగింది. ఇందులో పెద్దపులులు ఉన్న 13 దేశాల నాయకులు పాల్గొన్నారు. 20 శతాబ్దం నాటికి అడవుల్లో 97% పులులు మరణించాయనే ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అప్పటికి 3200గా ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెట్టింపు చేసే ఉద్దేశంతో కార్యాచరణ రూపొందించారు. ఈ సమావేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏటా జులై 29న ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం’గా నిర్వహించాలని తీర్మానించారు.
భారతదేశంలో పులుల జనాభా, ప్రాజెక్ట్ టైగర్ - దాని లక్ష్యాలు, పులి సంరక్షణ కేంద్రాలు - కోర్ జోన్, బఫర్ జోన్ మొదలైన అంశాలతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఏపీ పోలీస్ ఎస్‌ఐ, ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఎస్‌బీఐ పీవో మెయిన్స్, ఐబీపీఎస్ క్లర్క్ - మెయిన్స్, ప్రిలిమ్స్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 70కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2023), (ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)
1) జులై 5 2) జులై 30 3) జులై 29 4) జులై 4
సమాధానం: 3
2. పులి శాస్త్రీయ నామం ఏమిటి?
(బిహార్ పోలీస్ కానిస్టేబుల్, 2025)
1) పాంథెరా టైగ్రిస్ 2) పాంథెరా లియో
3) కానిస్ లూపస్ 4) అసినోనిక్స్ జుబాటస్
సమాధానం: 1
3. బెంగాల్ పులిని భారతదేశ జాతీయ జంతువుగా కింది ఏ సంవత్సరంలో స్వీకరించారు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ 2021)
1) 1978 2)1974 3) 1976 4) 1972
సమాధానం: 4
4. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2018 ప్రకారం కింది ఏ రాష్ట్రంలో పులుల జనాభా అత్యధికంగా ఉంది?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)
1) మధ్యప్రదేశ్ 2) ఛత్తీస్‌గఢ్
3) ఉత్తరాఖండ్ 4) కర్ణాటక
సమాధానం: 1
5. Tiger belongs to which category under IUCN?
(SSC MTS, 2019)
1) Critically endangered 2) Endangered
3) Vulnerable 4) Extinct
Ans: 2
6. Which of the following states do not have tiger reserves in India?
(TNPSC Group-I Services Prelims, 2014)
1) Kerala 2) West Bengal
3) Uttarakhand 4) Jammu and Kashmir
Ans: 4
7. Which of the following is the nodal organisation for International Big Cat Alliance in India?
(SSC CHSL 2025)
1) National Tiger Conservation Authority
2) National Lion Protection Authority
3) Wildlife Institute of India
4) Central Wildlife Control Board
Ans: 1
8. Which of the following has been declared a Tiger Reserve in 2025?
(RRB Group D, 2025)
1) Dholpur – Karauli Tiger Reserve 2) Parambikulam Tiger Reserve
3) Ranipur Tiger Reserve 4) Madhav Tiger Reserve
Ans: 4