జాతీయాదాయాన్ని అంచనా వేయడంలో, ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో గణాంకాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని సేకరించే కార్యక్రమాలను రూపొందించి, గణాంక కార్యకలాపాలను సమన్వయం చేయడానికి వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన మహలనోబిస్ అవసరమైన పద్ధతులను కూడా అభివృద్ధి చేశారు. అందుకే ఆయన్ను ‘ఆధునిక భారత గణాంక పితామహుడి’గా పేర్కొంటారు. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతి సందర్భంగా మన దేశంలో ఏటా జూన్ 29న ‘జాతీయ గణాంక దినోత్సవం’గా (National Statistics Day) నిర్వహిస్తారు. సామాజిక, ఆర్థిక ప్రణాళికల్లో గణాంకాల ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
మహలనోబిస్ అభివృద్ధి చేసిన గణాంకశాస్త్రం దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. భారత ప్రణాళికా వ్యవస్థకు జవహర్‌లాల్ నెహ్రూ పితామహుడు అయితే, ఆ ప్రణాళికా పథానికి మార్గనిర్దేశకుడిగా మహలనోబిస్ ప్రసిద్ధి చెందారు. గణాంకాలు, ఆర్థిక ప్రణాళికా రంగంలో మహలనోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా ఏటా జూన్ 29న ‘జాతీయ గణాంక దినోత్సవం’గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2007లో తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
| గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, జాతీయ గణాంక కార్యాలయం, జాతీయ గణాంక కమిషన్ తదితర సమాచారంతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ క్లర్క్స్ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 80కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కిందివాటిలో ఏది మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేస్తుంది?
(ఓఎస్‌ఎస్‌సీ బీఎస్‌ఎస్‌ఓ, 2022)
1) నీతిఆయోగ్ 2) జాతీయ గణాంక కార్యాలయం
3) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4) ఆర్థిక సలహా మండలి
సమాధానం: 2
2. జాతీయ గణాంక కార్యాలయాన్ని కింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
(సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ (ఫైర్‌మాన్), 2023)
1) 2019 2) 2017 3) 2018 4) 2016
సమాధానం: 1
3. మన దేశంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2023),
(యూపీపీఎస్సీ జీఐసీ లెక్చరర్ ఎకనామిక్స్, 2017)
1) జూన్ 22 2) జూన్ 15 3) జూన్ 28 4) జూన్ 29
సమాధానం: 4
4. భారతదేశంలో గణాంకశాస్త్ర పితామహుడు అని ఎవర్ని పేర్కొంటారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీఆర్‌టీ, 2018)
1) బి.సి.దత్ 2) దాదాభాయ్ నౌరోజీ
3) ఎన్.ఎల్.ఆర్.మాధవ్ మీనన్ 4) ప్రశాంత చంద్ర మహలనోబిస్
సమాధానం: 4
5. Statistics Day of India is celebrated each year on 29 June to mark the birth anniversary of:
(SSC MTS, 2021)
1) KC Sreedharan Pillai 2) CR Rao
3) Raghu Raj Bahadur 4) PC Mahalanobis
Ans: 4
6. The Ministry of Statistics & Programme Implementation (MoSPI) releases the Index of Industrial Production (IIP) at which of the following time intervals?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) Half yearly 2) Weekly 3) Monthly 4) Quarterly
Ans: 3
7. In which year was the National Statistical Commission was constituted?
(SSC MTS, 2026)
1) 2006 2) 2008 3) 2010 4) 2012
Ans: 1
8. Prasanta Chandra Mahalanobis established the _______.
(SSC MTS, 2026)
1) Reserve Bank of India 2) State Bank of India
3) Indian Statistical Institute 4) National Sample Survey Office
Ans: 3