అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం

అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగగా ఒలింపిక్స్‌ను పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఇవి క్రీడానైపుణ్యానికి, అంతర్జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి. వీటిని సాధారణంగా ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్‌ 23న ‘అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం’ (International Olympic Day) గా నిర్వహిస్తారు. లింగం, వయసు, క్రీడాకారుల సామర్థ్యం అనే వివక్ష లేకుండా అందరూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఒలింపిక్‌ చరిత్ర

  • ఈ క్రీడల చరిత్ర సుమారు మూడు వేల ఏళ్ల క్రితం నాటిది. ప్రాచీన గ్రీస్‌లోని ఒలింపియాలో ప్రతి నాలుగేళ్లకోసారి వీటిని నిర్వహించేవారు. ఇవే ఒలింపిక్‌ క్రీడలుగా పేరొందాయి. మొదటి ఒలింపిక్‌ క్రీడలు క్రీ.పూ.776లో జరిగినట్లు ఆధారాలున్నాయి. గ్రీకు దేవుడైన జ్యూస్‌ను గౌరవించుకోవడానికి వీటిని నిర్వహించేవారు. క్రీ.శ. 394 వరకు ఇవి జరిగాయి.
  • ఫ్రెంచ్‌ చరిత్రకారుడు బారన్‌ పియరీ కూబెర్టిన్‌ 19వ శతాబ్దంలో ఒలింపిక్స్‌ క్రీడలను పునరుద్ధరించాలని భావించారు. మొదటి ఆధునిక ఒలింపిక్స్‌ క్రీడలు 1896లో ఏథెన్స్‌లో జరిగాయి. 14 దేశాలు పాల్గొనగా, మొత్తం 9 ఆటలు జరిగాయి.

వింటర్‌ ఒలింపిక్స్‌

తొలి వింటర్‌ ఒలింపిక్స్‌ 1924లో చమోనిక్స్‌ (ఫ్రాన్స్‌)లో జరిగాయి. మొదట్లో దీన్ని ‘ఇంటర్నేషనల్‌ వింటర్‌ స్పోర్ట్స్‌ వీక్‌’ అని పిలిచారు. 1926లో లిస్బన్‌ (పోర్చుగల్‌)లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఆ పేరును ‘ఒలింపిక్స్‌ వింటర్‌ గేమ్స్‌’గా మార్చారు.

పారా ఒలింపిక్స్

  • ఇవి మొదటిసారిగా 1960లో ఇటలీలోని రోమ్‌లో జరిగాయి. ఇందులో 23 దేశాలకు చెందిన 400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి వీటిని నిర్వహిస్తున్నారు.
  • ఒలింపిక్‌ లోగో, నినాదం; ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), భారత ఒలింపిక్‌ చరిత్రలోని కీలక మైలురాళ్లు

భారత ఒలింపిక్‌ చరిత్ర

భారతదేశ ఒలింపిక్‌ ప్రస్థానం 1900 పారిస్‌ క్రీడలతో ప్రారంభమైంది. అక్కడ భారత సంతతికి చెందిన అథ్లెట్‌ నార్మన్‌ ప్రిచర్డ్‌ అథ్లెటిక్స్‌లో (100 మీ., 200 మీ. స్ప్రింట్స్‌) రెండు రజత పతకాలు నెగ్గాడు. 1900 నుంచి 2025 వరకు జరిగిన  25 ఒలింపిక్స్‌లో భారత్‌ మొత్తం 41 పతకాలు గెలుచుకుంది. అందులో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఉన్నాయి.

చారిత్రక నేపథ్యం

ఫ్రెంచ్‌ చరిత్రకారుడు బారన్‌ పియరీ కూబెర్టిన్‌ ఒలింపిక్‌ క్రీడలను పునరుద్ధరించాలని భావించి, 1894, జూన్‌ 23న అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)ని ఏర్పాటు చేశారు. మొదటి ఆధునిక ఒలింపిక్‌ క్రీడలు 1896, ఏప్రిల్‌ 6 నుంచి 14 వరకు గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరిగాయి. 1948లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఐఓసీ 42వ సమావేశంలో ఏటా జూన్‌ 23న ‘అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం’గా నిర్వహించాలని తీర్మానించారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
(యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ పీఈటీ, 2025)

1) జులై 31 2) ఫిబ్రవరి 16

3) జూన్‌ 23 4) జూన్‌ 11

సమాధానం: 3

2. మొదటి ఆధునిక ఒలింపిక్స్‌ క్రీడలు ఎప్పుడు జరిగాయి?
(ఎస్ఎస్‌సీ జీడీ, 2019)

1) 1896 2) 1935 3) 1943 4) 1921

సమాధానం: 1

3. 2020 సమ్మర్‌ ఒలింపిక్స్‌లో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
(ఎస్‌ఎస్‌సీ జీడీ, 2023)

1) 210      2) 203 3) 206 4) 209

సమాధానం: 3

4. ఆధునిక ఒలింపిక్స్ క్రీడల గరిష్ఠ వ్యవధి?
(ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ, 2019)

1) 16 రోజులు     2) 30 రోజులు

3) 45 రోజులు    4) 21 రోజులు

సమాధానం: 1

5. The Olympic Games are held every __.
(SSC CGL 2023)
1) fifth year 2) third year 3) fourth year 4) second year
Ans: 3
6. India had a single representative at the Paris ___ Olympics.
(SSC CHSL 2025)
1) 1900 2) 1908 3) 1904 4) 1896
Ans: 1
7. The Olympic Games held in the year 2021 were hosted by which country?
(Maharashtra Police Constable 2021)
1) China 2) Japan 3) Russia 4) Britain
Ans: 2
8. Which of the following was included as an official Olympic sport in December 2020?
(SSC CHSL 2021)
1) Chess 2) Breakdancing 3) Bowling 4) Cricket
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram