ప్రపంచ వర్షారణ్య దినోత్సవం

ప్రపంచ వర్షారణ్య దినోత్సవం

సతత హరితారణ్యాలు ఎక్కువగా విస్తరించిన భూభాగాన్ని వర్షారణ్యాలు అంటారు. ఇవి అత్యంత పురాతన జీవావరణ వ్యవస్థలను కలిగి, ప్రపంచంలోని సగానికిపైగా వృక్ష, జంతు జాతులకు నిలయాలుగా ఉన్నాయి. వర్షారణ్యాల వల్ల భూగోళానికి, జీవవైవిధ్యానికి కలిగే ప్రయోజనాలను తెలిపే లక్ష్యంతో ఏటా జూన్‌ 22న ‘ప్రపంచ వర్షారణ్య దినోత్సవం’గా (World Rainforest Day) నిర్వహిస్తారు. వర్షారణ్యాల ప్రాధాన్యం, ఉపయోగాలు, నిర్మూలించడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • పొడవైన చెట్లు, సతతహరిత వృక్షాలతో దట్టంగా నిండి; గణనీయమైన వర్షపాతాన్ని పొందే ప్రాంతాన్ని వర్షారణ్యం అంటారు. ఈ ప్రాంతాల్లో సాధారణంగా 200 సెం.మీ. లేదా అంత కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. గతంలో వీటి విస్తీర్ణం 14% ఉండగా ప్రస్తుతం 6శాతానికి పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే వందేళ్లలో భూమిపై వర్షారణ్యాలు పూర్తిగా అంతరిస్తాయని పర్యావరణవేత్తల అభిప్రాయం.
  • వర్షారణ్యాలు సమృద్ధిగా జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. కేవలం 10 చ.కి.మీ. విస్తీర్ణంలో 1500 వరకు పుష్పించే మొక్కలు, 750 చెట్ల జాతులు, 400 పక్షిజాతులు, 150 సీతాకోకచిలుక జాతులకు ఇవి ఆశ్రయం ఇవ్వగలవు. అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలో వర్షారణ్యాలు వృద్ధి చెందుతాయి. దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ నది, ఆఫ్రికాలోని కాంగో నది చుట్టూ ఉన్న అడవులు భూమిపై అతిపెద్ద వర్షారణ్యాలు.

వర్షారణ్యాలు రెండు రకాలు. 

ఎ. ఉష్ణమండల వర్షారణ్యాలు (Tropical rainforests):

  • భూమిపై అత్యంత అసాధారణ, జీవవైవిధ్యం అధికంగా ఉన్న జీవావరణ వ్యవస్థల్లో ఉష్ణమండల వర్షారణ్యాలు ఒకటి. ఇవి కర్కాటక రేఖ, మకర రేఖ మధ్య విస్తరించి ఉన్నాయి. ఇవి ప్రధానంగా మధ్య - దక్షిణ అమెరికా, మధ్య - పశ్చిమ ఆఫ్రికా, ఆగ్నేయాసియా, న్యూగినియా, ఆస్ట్రేలియా, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. 
  • ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం - అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌. 

బి. సమశీతోష్ణ వర్షారణ్యాలు (Temperate Rainforests):

  • ఇవి ప్రధానంగా ఉత్తర, దక్షిణ అర్ధగోళాల్లో 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల మధ్య విస్తరించి ఉన్నాయి. వీటిలో ఏడాది పొడవునా భారీ వర్షపాతం ఉంటుంది. ఉష్ణమండల వర్షారణ్యాలతో పోలిస్తే తక్కువ సగటు ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. ఇవి దట్టమైన వృక్షసంపదకు నిలయం. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో కీలకంగా ఉంటాయి. 
  • పసిఫిక్‌ సమశీతోష్ణ వర్షారణ్యం అతి పొడవైంది.  

చారిత్రక నేపథ్యం

  • వర్షారణ్యాల అభివృద్ధి, రక్షణే ధ్యేయంగా నియాంట్‌ స్పెల్మన్‌ 2007లో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ‘రెయిన్‌ఫారెస్ట్‌ పార్టనర్‌షిప్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. కలప, పరిశ్రమల స్థాపన, వ్యవసాయం, నివాస అవసరాల కోసం వర్షారణ్యాలను నిర్మూలించడాన్ని అరికట్టి, వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్‌ 22న ‘ప్రపంచ వర్షారణ్య దినోత్సవం’గా జరుపుకోవాలని 2017లో ‘రెయిన్‌ఫారెస్ట్‌ పార్టనర్‌షిప్‌’ ప్రపంచ దేశాలకు సూచించింది.
వర్షారణ్యాల నిర్మాణం, రకాలు - విశేషాలు, ప్రపంచంలో టాప్‌ - 5 వర్షారణ్యాలు, వర్షారణ్యాల ప్రాముఖ్యత, వాటి తరుగుదల తదితర అంశాలతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ లాంటి పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 75కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’ వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978  

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జైల్‌ వార్డర్, 2025)

1) జూన్‌ 21       2) జూన్‌ 22       3) జూన్‌ 23        4) జూన్‌ 24

సమాధానం: 2

2. ఉష్ణమండల వర్షారణ్యం ముఖ్య లక్షణం?
(టెరిటోరియల్‌ ఆర్మీ, 2019)

1) చెట్లు లేకపోవడం             2) అత్యల్ప ఉత్పాదకత

3) అత్యధిక జీవవైవిధ్యం          4) కనిష్ఠ వైవిధ్యం

సమాధానం: 3

3. వర్షారణ్యంలో కింది ఏది ప్రధాన పొరగా ఉంటుంది?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022)

1) కానోపీ పొర     2) అండర్‌స్టోరీ పొర

3) అటవీ నేల      4) ఎమర్జెంట్‌ పొర

సమాధానం: 1

4. Why has UNESCO recognized the Western Ghats as globally important?
(SSC CGL 2025)

1) They define urban river systems

2) They impact monsoon patterns and host rich biodiversity

3) They contain polar ecosystems

4) They are volcanic desert regions

Ans: 2

5. The 2nd top layers of a rainforest, formed by the thick leaves of tall trees is known as: 
(RPF SI CBT-I 2024)

1) understory layer             2) emergent layer

3) forest floor                4) canopy layer

Ans: 4

6. Which of the following natural regions is known for evergreen dense forests and high biodiversity?
(RRB NTPC (UG) CBT-I Official Paper 2025)

1) Equatorial region            2) Tundra region

3) Steppe region            4) Mediterranean region

Ans: 1

7. In India Tropical Rain Forests are found in
(CTET July 2013)

1) Madhya Pradesh            2) Himachal Pradesh

3) Andaman & Nicobar Islands    4) Rajasthan

Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram