డబ్ల్యూఎంవో నివేదిక

డబ్ల్యూఎంవో నివేదిక
  • ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా భూమిపై నీటి వ్యవస్థ (వాటర్‌ సైకిల్‌) తీవ్ర అస్తవ్యస్తంగా, అత్యంత ప్రమాదకరంగా మారుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. అయిదేళ్ల పాటు పరిశోధన చేసిన స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ వాటర్‌ రిసోర్సెస్‌ రిపోర్టులో డబ్ల్యూఎంవో ఈ కీలక విషయాలు వెల్లడించింది. గ్లేసియర్లు (హిమానీనదాలు) వేగంగా కరిగిపోతుండటం, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో ఒకచోట భారీ వరదలు, మరోచోట కరవులు సంభవిస్తున్నాయని పేర్కొంది.

  • గత అయిదేళ్లలో సంభవించిన నీటి సంబంధిత విపత్తుల్లో (వరదలు, కరవులు) సగానికిపైగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే ఉన్నాయని డబ్ల్యూఎంఓ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం, నీటి విపత్తుల వల్ల సంభవించిన మరణాల్లో 80 శాతానికిపైగా ఈ రెండు ఖండాల్లోనే నమోదయ్యాయి.వడం గమనార్హం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram