అంటార్కిటికాలో పెరిగిన మంచు

అంటార్కిటికాలో పెరిగిన మంచు

2021 నుంచి 2023 మధ్య కాలంలో అంటార్కిటికాలో మంచు భారీగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా తూర్పు అంటార్కిటికాలో ఏకంగా 695 బిలియన్‌ టన్నుల(69,500 టన్నులు) మంచు చేరింది. ఇది జీఆర్‌ఏసీఈ ఉపగ్రహ మిషన్‌ రికార్డుల్లో నమోదైన అతిపెద్ద పెరుగుదలగా శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఆ విషయాన్ని వెల్లడించింది. నేచుర్‌ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

  • తూర్పు అంటార్కిటికాలో మంచు పెరగడానికి అక్కడి వాతావరణమే కాకుండా, వేల కిలోమీటర్ల దూరంలోని ఉష్ణమండల సముద్రం కీలకంగా పనిచేసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram