2026 ఏఎస్‌కే ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా ‘చీతా’ సూచీలో అంకుర సంస్థల సంఖ్య గత అయిదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 110కి చేరిందని పేర్కొంది. 2000 లేదా ఆ తర్వాత స్థాపితమై 200-500 మిలియన్ డాలర్ల మధ్య విలువ కలిగి, అయిదేళ్ల లోపు యూనికార్న్ (100 కోట్ల డాలర్లకు పైగా విలువ ఉన్న సంస్థ) హోదాను చేరొచ్చనే అంచనాలున్న అన్‌లిస్టెడ్ అంకురాలను ఈ సూచీలో ‘చీతా’గా వ్యవహరిస్తారు. 2026 ‘చీతా’ సూచీలోని 110 సంస్థల మొత్తం విలువ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉంది. సగటున ఒక్కో సంస్థ విలువ రూ.2,820 కోట్లు. ఈ 110 చీతాలు దాదాపు 1.10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.