ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్‌టీ) 2026, సెప్టెంబరు 7న ప్రకటించిన ప్రపంచ టాప్ 100 ‘మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఎంఐఎం) 2026’ ర్యాంకుల్లో మన దేశానికి చెందిన 14 బి-స్కూళ్లకు చోటు దక్కింది. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ గాలెన్ ఈసారి కూడా ప్రపంచంలో తొలిస్థానాన్ని పొందింది.
భారత్‌కు చెందిన సంస్థల వరకు చూస్తే బెంగళూరు ఐఐఎం ప్రథమ స్థానంలో నిలిచింది. 2024లో ప్రపంచంలో ఇది 41వ ర్యాంకులో, 2025లో 28వ స్థానంలో ఉంటే ఈ ఏడాది ఇంకా మెరుగుపడి 21వ స్థానానికి వచ్చింది.