అల్ట్రాటా నివేదిక

అల్ట్రాటా నివేదిక
  • ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 2025లో రికార్డు స్థాయికి చేరింది. కృత్రిమ మేధ(ఏఐ) పుణ్యమాని వీరి సంపదలో భారీ వృద్ధి కనిపించిందని వెల్త్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అల్ట్రాటా పేర్కొంది. ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 3,795కు చేరగా, వీరి సంపద 15.1 లక్షల కోట్ల డాలర్ల(దాదాపు రూ.1434 లక్షల కోట్లు)గా నమోదైంది.

  • ఒక్క ఏడాదిలో వీరి సంపదలో 12.8% వృద్ధి కనిపించగా, బిలియనీర్ల సంఖ్య 8.2% మేర పెరిగింది. గత అయిదేళ్లలో ఇదే అధిక వార్షిక వృద్ధి. ఏఐ బూమ్‌కు తోడు, టెక్‌ కంపెనీలు బలంగా రాణించడం ఇందుకు నేపథ్యం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram