‘ఆర్య.ఏజీ’ నివేదిక

‘ఆర్య.ఏజీ’ నివేదిక

మన దేశంలో మహిళలు వ్యవసాయ రంగంలో ఎంతో శ్రమిస్తున్నా.. వారికి తగిన గుర్తింపు, సహకారం లభించడం లేదని ‘ఆర్య.ఏజీ’ అనే వ్యవసాయ-వాణిజ్య వేదిక తన నివేదికలో వెల్లడించింది. సాగు రంగంలో ఉన్న అతివల్లో సగం మందిని రైతులుగా గుర్తించకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకత విషయంలో దేశానికి ఏటా రూ.2 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. ‘హర్‌ హార్వెస్ట్‌ 2026: ద హిడెన్‌ కాస్ట్‌ ఆఫ్‌ వుమెన్స్‌ ఇన్విజిబుల్‌ వర్క్‌ ఇన్‌ ఇండియన్‌ అగ్రికల్చర్‌’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. వ్యవసాయ రంగంలోని మహిళల్లో దాదాపు 50.5 శాతం మంది తమ కుటుంబ సాగు భూముల్లో.. చెల్లింపులేమీ లేని సహాయకులుగానే ఉన్నారని తెలిపింది. పురుషుల్లో ఇలాంటివారి వాటా 21.7 శాతంగా ఉందని వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram