ప్రపంచ బ్యాంకు నివేదిక

ప్రపంచ బ్యాంకు నివేదిక
  • కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాతావరణ అంచనాలు తెలంగాణలోని చిన్న రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూర్చాయని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఏఐతో రూపొందించిన వాతావరణ సూచనలను ఉపయోగించి రైతులు వాతావరణ ముప్పులకు అనుగుణంగా తమ వ్యవసాయ విధానాలను మార్చుకోవడంతో ఒక్కో రైతుకు గరిష్ఠంగా 560 అమెరికా డాలర్ల (సుమారు రూ.53 వేల) వరకు నికరంగా ఆదా అయిందని ఈ నివేదిక తెలిపింది.

  • ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ‘వరల్డ్‌ డెవలప్‌మెంట్‌ నివేదిక- 2026- ది ప్రామిస్‌ ఆఫ్‌ ఏఐ’లో తెలంగాణలో ఏఐ వినియోగం ద్వారా వచ్చిన ఫలితాలను ప్రస్తావించింది. మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 2025లో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ అంశాలను నివేదికలో పొందుపరిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram