పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ

పురావస్తు రక్షిత స్థలాలుగా కొండారెడ్డి బురుజు, లింగాలకొండ

ఆంధ్రప్రదేశ్‌లోని పలు చారిత్రక స్థలాలను పురావస్తుశాఖ పరిధిలోని రక్షిత స్థలాల జాబితాలో చేర్చాలని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. ఇందులో కర్నూలులోని కొండారెడ్డి బురుజు, అనకాపల్లి జిల్లా శంకరంలోని లింగాలకొండ, బొజ్జనకొండ, శ్రీకాకుళం జిల్లా శాలిహుండం, పల్నాడు జిల్లా పుల్లారెడ్డిగూడెం (అగ్రహారం)లోని నాగార్జునకొండ బౌద్ధ స్మారకాలను ‘ప్రాచీన స్మారకాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేష నియమాలు-1959’ పరిధిలోకి చేర్చనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను 2026, సెప్టెంబరు 8న జారీచేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram