పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా

పెరిగిన ఎస్సీ, ఎస్టీల జనాభా

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఎస్సీ, ఎస్టీల మొత్తం జనాభా 25.85 శాతం ఉంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలు కలిపి 1,01,95,478 మంది ఉన్నారు. ఇక్కడ అన్నివర్గాల మొత్తం జనాభా 3,67,97,821 ఉంది. ఆ ప్రకారం చూస్తే గ్రామీణంలో 27.70 శాతానికి చేరింది. అంటే గతంలో కంటే 1.85 శాతం మేర పెరిగింది.

  • కూటమి ప్రభుత్వం 2026, జనవరి నుంచి మార్చి వరకు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఇది వెల్లడైంది. మూడు నెలలపాటు స్వర్ణ వార్డు, స్వర్ణ సచివాలయాల సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల నుంచి 28 అంశాలను సేకరించారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరసామాజికవర్గాల వివరాలనూ తీసుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram