ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ సంస్థలకు త్వరలో నిర్వహించే ఎన్నికల్లోనూ వెనుకబడిన తరగతులకు (బీసీ) 34% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు కల్పించిన 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తున్నట్లుగా 2026, ఆగస్టు 20న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ మేరకు పంచాయతీల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ సభ్యులు), మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు (జడ్పీటీసీ సభ్యులు), జిల్లా పరిషత్ ఛైర్మన్లకు బీసీ రిజర్వేషన్లు 34% కల్పిస్తున్నట్లుగా పేర్కొంది.