ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును రాష్ట్ర ప్రభుత్వం 2026, ఆగస్టు 19న నియమించింది. ఆయన ఈ పదవిలో అయిదేళ్ల పాటు కొనసాగుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నియామకాన్ని ఆమోదించారు.
ప్రస్తుత డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పుల్లేటికుర్రులో 1964 జనవరి 19న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు జన్మించారు. 2022 ఆగస్టు 4న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 మార్చి 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై ప్రమాణం చేశారు. 2026, జనవరి 18న న్యాయమూర్తిగా పదవీవిరమణ చేశారు.