ఆంధ్రప్రదేశ్‌లో మేయర్, పురపాలక ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతించే ఏపీ పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లును మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ 2026, ఆగస్టు 19న శాసనసభలో ప్రవేశ పెట్టగా, సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పట్టణ పాలనలో బాధ్యత, స్థిరత్వం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే అవకాశంగా ప్రత్యక్ష ఎన్నికల విధానం తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.