ఆంధ్రప్రదేశ్‌లో జననాలు తగ్గిపోతుండడంతో పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య క్రమంగా పడిపోతోంది. 2025లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో కలిపి మొత్తం 84.37 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. 2026లో ఈ సంఖ్య 81.75 లక్షలకు తగ్గింది. ఒక్క ఏడాదిలోనే 2.62 లక్షల పిల్లల సంఖ్య తగ్గింది. జననాలు తగ్గడంతో ప్రవేశాలపై ప్రభావం కనిపిస్తోంది. ఏటా అన్ని యాజమాన్యాల్లో కలిపి 6 లక్షలకుపైగా ప్రవేశాలు నమోదు కావాల్సి ఉండగా.. ఈ స్థాయిలో చేరికలు ఉండడం లేదు.