వీబీ జీరామ్‌జీ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. శ్రామికులకు ఉపాధి కల్పనతోపాటు వేతనాల చెల్లింపుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పనులకు హాజరైన శ్రామికులకు అత్యధికంగా రూ.91 కోట్ల వేతనాలు చెల్లించి దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రూ.81 కోట్లతో రాజస్థాన్ రెండు, రూ.59 కోట్ల చెల్లింపులతో అస్సాం మూడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది.