ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్షా, ఉద్యాన శాఖల శకటాలకు ఉమ్మడిగా ప్రథమ బహుమతి లభించింది. చేనేత, జౌళిశాఖ శకటానికి రెండు, అటవీశాఖ శకటానికి మూడో బహుమతి లభించాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. రాష్ట్రాభివృద్ధి- సంక్షేమంలో ఆయా శాఖలు పోషిస్తున్న పాత్రను వివరిస్తూ మొత్తం 26 శకటాల్ని ప్రదర్శించారు.