‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది

‘స్త్రీశక్తి’ పథకానికి ఏడాది

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీశక్తి’ పథకం ఆరంభించి 2026, ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు ఈ పథకాన్ని వినియోగించుకొని మహిళలు 87 కోట్ల ప్రయాణాలు చేశారు. రోజుకు సగటున 24 లక్షల ప్రయాణాలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా పరిమితులు లేకుండా ప్రయాణించేలా స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం 2025, ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఆర్టీసీలో 9,978 బస్సులు ఉంటే, వాటిలో 7,631 (76%) బస్సుల్లో ఈ పథకం వర్తిస్తోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram